Ticker

6/recent/ticker-posts

Fits in Children: పిల్ల‌ల్లో మూర్చ‌లు(ఫిట్స్‌) రావ‌డానికి కార‌ణాలు!

Fits in Children: ప్ర‌స్తుతం వ‌య‌స్సుతో ప‌నిలేకుండా పెద్ద‌ల్లో, పిల్ల‌ల్లోనూ ఫిట్స్ (మూర్ఛ‌లు) రావ‌ డానికి సాధార‌ణంగా ఒకే ర‌క‌మైన కార‌ణాలు ఉంటాయి. కానీ ఐదు సంవ‌త్స‌రాల్లోపు పిల్ల‌ల్లో మాత్రం ప్ర‌త్యేకంగా అధిక శ‌రీర ఉష్ణోగ్ర‌త అనేది ఫిట్స్ రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణంగా వైద్యులు చెబుతున్నారు. 

image show Fits in Children

Fits in Children: ఫిట్స్ ఎందుకు వ‌స్తుంటాయి?

జ‌ర్వంతో వ‌చ్చే ఇలాంటి ఫిట్స్‌ను ఫిబ్రైల్ క‌న్వ‌ల్ష‌న్స్ (febrile convulsion) అంటారు. వీటిని మామూలు ఫిట్స్‌గా భావించి కంగారు ప‌డాల్సిన ప‌నిలేద‌ని చెబుతున్నారు. కానీ స‌రైన వ్యాధి నిర్ణ‌యం కోసం కొన్ని ప‌రీక్ష‌లు చేయించాల్సిన అవ‌స‌రం క‌చ్చితంగా ఉంటుంది. ఇలాంటి స్థితిని ఆయుర్వేదంలో మూర్ఛ అని అంటారు.ఇది కొన్ని కుటుంబాల‌లో అనువంశికంగా వ‌స్తుంది. అంటే త‌ల్లిదండ్రుల్లో ఎవ‌రికైనా చిన్న‌త‌నంలోనే జ్వ‌రం కార‌ణంగా ఫిట్స్ వ‌చ్చి వుంటే, వారి సంతానానికి కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంటుద‌న్న‌మాట‌. 

జ్వ‌రంతో వ‌చ్చే Fits కానీ, ఇత‌ర కార‌ణాల‌తో వ‌చ్చే ఫిట్స్ కానీ రెండూ చూడ‌టానికి ఒకే విధంగా వుంటాయి. రెండు ర‌కాల్లోనూ ల‌క్ష‌ణాలు భ‌యోత్పాతంగానే క‌నిపిస్తాయి. ఈ రెండెంటి మ‌ధ్య తేడా మామూలు ఫిట్స్ ఆయా కార‌ణాల‌ను అసుస‌రించి వ‌స్తే, ఫిబ్రైల్ క‌న్వ‌ల్ష‌న్స్  కేవ‌లం జ్వ‌రం వ‌చ్చి న‌ప్పుడు మాత్ర‌మే వ‌స్తుంటాయి. టాన్సిలైటిస్‌, చెవి ఇన్‌ఫెక్ష‌న్లు, మీజిల్స్‌, ఫ్లూ వంటి ఇన్‌ఫెక్ష‌న్ల‌లో జ్వ‌రంతో పాటు దానిని అనుస‌రించి ఫిట్స్ వ‌స్తుంటాయి. 

పిల్ల‌ల్లో జ్వ‌రం స‌మ‌యంలో ఫిట్స్ రావ‌డానికి కార‌ణం వారి మెద‌డు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంద‌క పోవ‌డ‌మేన‌ని వైద్యులు అంటున్నారు. మామూలుగా పెద్ద‌వారిలో జ్వ‌రం వ‌చ్చిన‌ప్పుడు మెద‌డులో ఉష్ణోగ్ర‌త‌ను నియంత్రించే కేంద్రం ప్ర‌తిస్పందించి ఉష్ణోగ్ర‌త్త‌ను అదుపులోకి తెస్తుంది. అయితే పిల్ల‌ల్లో ఈ ఉస్ణోగ్ర‌త నియంత్ర‌ణ కేంద్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెంద‌క‌పోవ‌డం వ‌ల్ల మెద‌డులో హ‌ఠాత్తుగా విద్యుత్ ప్ర‌కంప‌న‌లు విడుద‌లై కండ‌రాల‌కు చేరి ఫిట్స్ క‌లిగిస్తాయి.

పిల్ల‌ల్లో మూర్చ‌లు (Murchalu) వ‌చ్చిన‌ప్పుడు

మూర్ఛ‌లు వ‌చ్చిన‌ప్పుడు పిల్ల‌లు (Fits in Children) తాత్కాలికంగా తెలివి త‌ప్పు తారు. త‌రువాత కుదుపులూ, అసంక‌ల్పిత క‌దిలిక‌లు ప్రారంభం అవుతాయి. ఈ స్థితి ప్రారంభం కావ‌డానికి ముందు కాళ్లూ చేతులూ బిగుసుకుంటాయి. ఒక్కొక్క‌సారి మూత్రం బ‌ట్ట‌ల్లో ప‌డిపోవ‌డం, నాలుక కొరుక్కోవ‌డం జ‌రుగుతాయి. ఇలా దాదాపు ఐదు నిమిషాలు సేపు జ‌రుగుతుంది. త‌ర్వాత నెమ్మ‌దిగా తెలివి వ‌స్తుంది. ఇలా మ‌ళ్లీ మ‌ళ్లీ జ‌రిగే అవ‌కాశం ఉంది.  మూర్ఛ‌లు త‌గ్గిన త‌ర్వాత కూడా చాలా సేప‌టి వ‌ర‌కు చిరాకు, మ‌గ‌త‌, త‌ల‌నొప్పులు ఉంటాయి. 

Post a Comment

0 Comments