Ticker

6/recent/ticker-posts

Aspirin Tablet History: యాస్‌ప్రిన్ గురించి తెలియ‌ని నిజ‌నిజాలు!

Aspirin Tablet History: మ‌నం ఏదో ఒక స‌మ‌యంలో యాస్‌ప్రిన్ టాబ్లెట్స్ వాడిన‌వార‌మే క‌దా. ప్ర‌పంచంలో మందుల‌న్నింటి కంటే ఎక్కువుగా వాడ‌బ‌డుతున్న వాటిల్లో యాస్‌ప్రిన్ ఒక‌టి అంట‌. ఈ మాట వింటే ఒక ర‌కంగా ఆశ్చ‌ర్య పోవాల్సిందే మ‌రి. 

image show Aspirin Tablet History

ఒక్క అమెరికా లోనే సాలీనా ఉత్ప‌త్తి అయ్యే యాస్ప్రిన్ 30 మిలియ‌న్ల పౌన్లు అంట‌. అమెరిక‌న్లు 15 బిలియ‌న్ యాస్‌ప్రిన్ మాత్ర‌లు మింగుతున్నారంట‌. ఇవి కాక యాస్ప్రిన్ ప‌లు మందుల్లో, ఔష‌ధాల్లో క‌లుస్తుంది. అయితే యాస్ప్రిన్ ఈనాటిది కాదు.

Aspirin Tablet History: యాస్‌ప్రిన్ టాబ్లెట్‌ను ఎప్పుడు గుర్తించారు?

యాస్ప్రిన్ లాంటి మందులు ముఖ్యంగా నొప్పుల‌కి, జ్వ‌రాల‌కి వాడ‌వ‌చ్చ‌ని రెండు శ‌తాబ్ధాల క్రిత‌మే తెలిసింది. శాలిక్స్ లేక విల్లో అనే మొక్క బెర‌డు నుంచి చేసిన క‌షాయాన్ని జ్వ‌రానికి వాడేవారు. జ్వ‌రాల‌కు, నొప్పుల‌కి ఉప‌శ‌మ‌నం క‌లిగించే శ‌క్తి ఇందులో ఉండే శాలిసిలిక్ యాసిడ్ వ‌ల్ల క‌లుగుతుంద‌ని ఒక శ‌తాబ్ధం క్రింద క‌నిపెట్టారు. 

శాలిసిలిక్ యాసిడ్‌కి సంబంధించి దాని లాగే ప‌నిచేసే ప‌దార్థాలు ఇంకా చాలా మొక్క‌ల్లో ఉన్నా యి. అయితే ఇప్పుడు శాలిసిలిక్ యాసిడ్‌ని మొక్క‌లోంచి తియ్య‌క్క‌ర లేదు. దాన్ని కృత్రి మంగా ర‌సాయ‌శాల‌లో త‌యారు చేసే ప‌ద్ధ‌తి చాలా సంవ‌త్స‌రాల నుంచి వాడుక‌లో వుంది. ఈ శాలిసిలిక్ యాసిడ్ నోటిలోనూ, క‌డుపులోను మంట పుట్టిస్తుంద‌ని నిపుణులు అంటున్నారు. అందువ‌ల్లనే ఇది ఎక్కువ వాడుక‌లోని రాలేద‌నే చెబుతున్నారు. 

salicylic acid లో నుంచి మాత్రం అసిట‌ల్ శాలిసిలిక్ యాసిడ్ అనే ప‌దార్థాన్ని జ‌ర్మ‌నీలో 80 ఏళ్ల క్రింద‌ట త‌యారు చేశారని చెబుతున్నారు. దానికే యాస్‌ప్రిన్ (Aspirin Tablet History) అనే పేరు పెట్టారు. అదే ఇప్పుడు దాదాపు 50 పేర్ల‌తో చ‌లామ‌ణి అవుతోంది. దీనికి శాలిసిలిక్ యాసిడ్‌కి వుండే గుణాల‌న్నీ వున్నాయి. ఆస్ప్రిన్ కూడా ఒక్క‌సారి మింగితే క‌డుపులో మంట క‌లిగిస్తుంది. కానీ ప్ర‌స్తుతం రోజుల్లో వ‌చ్చే మాత్ర‌లు గొంతులో వేసుకోగానే క‌రిగిపోయి మంట లేకుండా చేస్తాయి. అందుక‌నే వాటి వాడ‌కం ఇంత విప‌రీతంగా పెరిగింది.

యాస్ప్రిన్ చాలా ప్ర‌మాద‌క‌ర‌మైన‌ద‌నీ, గుండెకు మంచిది కాద‌నే ప‌లు ఊహలు ప్ర‌చారంలో వున్నాయి.కొన్నింటికి ఆధారం లేదు. కొంత మందికి యాస్ప్రిన్ ప‌డ‌దు, అలాంటి వారు వాడితే నిజంగా ప్ర‌మాద‌మే అంటున్నారు. 

యాస్‌ప్రిన్ టాబ్లెట్ ఉప‌యోగాలు!

1.Aspirin వేసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో జ్వ‌రాన్ని క‌లిగించే సూక్ష్మ జీవుల దాడిని ఎదుర్కొని త‌న్ను తాను ర‌క్షించుకోవ‌డానికి శ‌రీరంకు స‌హ‌క‌రిస్తుంది. 

2.శ‌రీరంలో ర‌క్తం భాగా ప్ర‌వ‌హించేట‌ట్టు చేస్తుంది. చెమ‌ట ఎక్కువ‌గా ప‌ట్టిస్తుంది. 

3.కీళ్ల‌ల్లో నొప్పులు, వాపులు త‌గ్గించి సులువుగా క‌దిలేట‌ట్టు చేస్తుంది. చాలా శ‌క్తివంతంగా ప‌నిచేస్తుంది.

4.Aspirin Tablet చాలా త‌క్కువ ధ‌ర‌కే వుంటుంది. చాలా ఉప‌యోక‌ర‌మైన మందు అన‌డంలో ఏ మాత్ర‌మూ సందేహం లేదు అంటున్నారు వైద్యులు.

Post a Comment

0 Comments