Ticker

6/recent/ticker-posts

Air borne Diseases : గాలిని ముక్కుతోనే పీల్చాలా నోటితో పీల్చితే ఏమి అవుతుంది?

Air borne Diseases : ఈ భూ ప్ర‌పంచంలో మ‌న చుట్టూ అనేక ర‌కాల సూక్ష్మ జీవులున్నాయ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. కానీ వాటి గురించి అదే ప‌నిగా ఆలోచించ‌ము. మ‌న‌లో కొంత మంది మాత్రం అదే ప‌నిగా ఆందోళ‌న చెందుతూ ఉంటారు. కానీ ఈ ఆందోళ‌న అంత మంచిది కాదు. ఎందు కంటే ఈ సూక్ష్మ జీవుల‌తో త‌ప్ప‌నిస‌రిగా ప్ర‌తి ప్రాణి స‌హ‌జీవ‌నం చేయాల్సిందే.

image show Air borne Diseases

Air borne Diseases : గాలి ద్వారా వ‌చ్చే వ్యాధులు, జాగ్ర‌త్త‌లు

అయితే వాటి నుంచి ర‌క్షించుకోవ‌డానికి కొన్ని ప్రాథ‌మిక జాగ్ర‌త్త‌లు తీసుకోవడం చాలా అవ‌స‌రం. ప్ర‌తి మ‌నిషీ స‌రాస‌రి రోజుకి 10,000 లీట‌ర్ల గాలి పీలుస్తాడంట‌. ధూళి అణువుల మీద‌, నీటి తుంప‌ర్ల లోనూ ఉండే సూక్ష్మ జీవులు గాలిలో వేగంగా ప్ర‌యాణం చేస్తాయి. మామూలుగా ఇళ్ళ‌లో ఉండే దుమ్ములో గ్రాముకి 20 ల‌క్ష‌ల సూక్ష్మ జీవులుంటాయ‌ని అంచ‌నా.

మ‌నం రోజుకి సాధార‌ణంగా 3-4 ల‌క్ష‌ల సూక్ష్మ జీవుల్ని గాలి ద్వారా లోప‌లికి పీల్చుకుంటామ‌ట‌. వాటిలో కొన్ని వ్యాధి జ‌న‌కాలుంటాయ‌ని నిపుణులు అంటున్నారు. అయిన‌ప్ప‌టికీ మ‌నం ఆరోగ్యంగా ఉండ‌గ‌లుగుతున్నామంటే మ‌న శ‌రీరానికి స్వ‌భావ సిద్ధంగా కొన్ని ఆత్మ ర‌క్ష‌ణ మార్గాలున్నాయిని అంటున్నారు. ముక్కులో ఉండే వెంట్రుక‌లు ఫిల్ట‌రులా ప‌నిచేసి గాలిలో ఉండే దుమ్ము, ధూళి లోప‌లికి పోకుండా కొంత వ‌ర‌కు ఆప‌గ‌లుగుతాయి.

నోటితో గాలి పీల్చితే ఏమి అవుతుంది?

అంతే కాకుండా ముక్కులో ఉండే జిగురు పొర‌ల్లో కొన్ని బాక్టీరియాలు ప‌ట్టుబ‌డిపోతాయి. నోటితో గాలి పీల్చ‌డం చెడ్డ అల‌వాటు అంటున్నారు. ఎందుకంటే అలా చేస్తే సూక్ష్మ జీవులు లోప‌లికి పోకుండా ఉండ‌టానికి ర‌క్ష‌ణ త‌గ్గిపోయి శ్వాస కోస వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం (Air borne Diseases) ఎక్కువుగా ఉంటుంద‌ట‌. 

మ‌నం మామూలుగా శ్వాస‌క్రియ జ‌రిపేట‌ప్పుడు వ‌దిలే గాలిలో సూక్ష్మ జీవులుండ‌వు. కానీ గ‌ట్టిగా మాట్లాడిన‌ప్పుడు,  తుమ్మిన‌ప్పుడు కొన్ని వేల, ల‌క్ష‌ల నీటి తుంప‌ర‌లు బ‌య‌ట‌కు వ‌స్తాయి. వీటి ద్వారా వ్యాధి జ‌న‌క సూక్ష్మ జీవులు వ్యాపిస్తాయి. అందుక‌ని ద‌గ్గిన‌ప్పుడు, తుమ్మిన‌ప్పుడు జేబురుమాలు అడ్డం పెట్టుకోవడం చాలా అవ‌స‌రం. 

మ‌నంద‌రి ముక్కుల్లోనూ, గొంతుల్లోనూ వ్యాధి జ‌న‌క సూక్ష్మ జీవులుంటాయి. అవి మ‌న‌కి హాని చేయ‌క‌పోవ‌చ్చు కానీ ఇతరుల‌కి హాని చేస్తాయి. అదే క్ర‌మంలో ఇత‌రుల శ‌రీరంలో ఉన్న సూక్ష్మ జీవులు వాళ్ల‌కి వ్యాధుల్ని క‌లిగించ‌క పోయినా మ‌న‌కు హానిక‌రం కావ‌చ్చు. మనం హాయిగా ఉండ‌టానికి ఉష్ణోగ్ర‌త‌, గాలిలో తేమ‌, గాలి చ‌ల‌నం ఇవ‌న్నీ ముఖ్యంగా గ‌మ‌నించాలి. 

ఉష్ణోగ్ర‌త‌, తేమ ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ  ఇంటిలో ఫ్యాన్ వేసుకుంటే గాలి సంచ‌ల‌నం వ‌ల్ల హాయిగా ఉంటుంది.  ఎయిర్ కండీష‌న‌ర్ గ‌దుల్లో ఉండే వారికి సూక్ష్మ జీవుల బెడ‌ద అంత‌గా ఉండ‌దని అంటున్నారు. కానీ ఎయిర్ కండీష‌న్ (AC) స‌రిగ్గా లేక‌పోతే అంటే మ‌రీ త‌క్కువ ఉష్ణోగ్ర‌త ఉండి, తేమ శాతం ఎక్కువ‌గా ఉంటే ఆరోగ్యం పాడ‌వుతుంద‌ని (Air borne Diseases) వైద్యులు చెబుతున్నారు.

Post a Comment

0 Comments