Ticker

6/recent/ticker-posts

Vitamin A For Eyes: స‌రిగ్గా క‌నిపించ‌డం లేదంటే ఎ విట‌మిన్ లోపమేనా?

 


Vitamin A For Eyes: విట‌మిన్ - ఎ కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది లోపించిన వారికి ప‌లు ర‌కాల రోగాలు వ‌చ్చే అవ‌కాశాలున్నాయ‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రపంచ వ్యాప్తం గా విట‌మిన్ - ఎ లోపం వ‌ల్ల సుమారు 5 ల‌క్ష‌ల మందికి పైగా చిన్నారులు అంధ‌త్వానికి గుర‌వు తున్నార‌ట‌. సుమారు 230 మందికి పైగా పిల్ల‌లు వ్యాధినిరోధ‌క శ‌క్తి కోల్పోయి ప‌లు వ్యాధుల బారిన ప‌డుతున్నార‌ట‌.

Vitamin A For Eyes: విట‌మిన్ - ఎ లోపం పిల్ల‌ల్లో ఎక్కువ‌గా ఉందా?

విట‌మిన్ - ఎ స‌మృద్ధిగా ల‌భించిన పిల్ల‌లు కంటే, ఈ విట‌మిన్ లోపంతో చిన్నారులు వివిధ స‌మ‌స్య‌ల‌తో మ‌ర‌ణించే అవ‌కాశం 20 నుంచి 30 శాతం అధికంగా ఉంటుంద‌ట‌. బీటాకెరోటిన్ అనే ప‌దార్థం ద్వారా విట‌మిన్ - ఎ ల‌భిస్తుంది. ప్ర‌కృతిలో దొరికే కేర‌ట్‌, క్యాబేజీ, బొప్పాయి, మున‌గ‌, ప‌చ్చ‌ని ఆకుకూర‌ల్లో ఇది స‌మృద్ధిగా ల‌భిస్తుంది. పాలు, వెన్న‌, మీగ‌డ‌, గుడ్లు, చేప‌ల్లో కూడా పుష్క‌లంగా ల‌భిస్తుంది. 

శ‌రీరంలో చ‌ర్మాన్ని, వివిధ అవ‌య‌వాల్లో ఉండే మ్యూక‌జ్ మెంబ్రేస్ (mucous membrane) అనే ప‌లుచ‌ని పొర‌ను ర‌క్షించ‌డంలో బాగా తోడ్ప‌డుతుంది. విట‌మిన్ - ఎ లోపిస్తే శ‌రీరంలో ప్ర‌ధానంగా దెబ్బ‌తినేవి క‌ళ్ళు. తొలి ద‌శ‌లో కంటి (Eyes) లోని తెల్లగుడ్డు ఎండిపోయిన‌ట్ల‌వుతుంది. న‌ల్ల గుడ్డు ప్ర‌కాశం కోల్పోతుంది. న‌ల్ల గుడ్డు ద్వారా కాంతి కిర‌ణాలు రెటీనాకు స్ప‌ష్టంగా చేర‌వు.  క‌ళ్ళ‌ల్లో ఇసుక ఉన్న‌ట్టు అనిపిస్తుంది. దీంతో క‌ళ్ళు దుర‌ద పుడ‌తాయి. రుద్దుకోవాల‌నిపిస్తుంది. రుద్దుకుంటే క‌ళ్ళు ఎర్ర‌బ‌డ‌తాయి. 

కాంతిని స‌రిగ్గా చూడ‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డుతుంది. తీవ్ర ద‌శ‌లో న‌ల్ల‌గుడ్డు పూర్తిగా క్షీణించిపోతుంది. దీనినే కెర‌టోమ‌లేసియా అంటారు. ద‌శ‌లో పూర్తి అంధ‌త్వం వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. కంటిలోని రోడోప్సిస్ అనే ప‌దార్థం త‌గ్గ‌డం వ‌ల్ల పిల్ల‌ల్లో రేచీక‌టి వ‌స్తుంది. విట‌మిన్ ఎ లోపించిన పిల్ల‌ల‌కు గాయాలు తొంద‌ర‌గా మాన‌వు. దంతాలు రావ‌డంలోనూ లోపాలుంటాయి. 

ఏడాదిలోపు చిన్నారుల‌కు ప్ర‌తిరోజూ వెయ్యి అంత‌ర్జాతీయ యూనిట్ల విట‌మిన్‌-ఎ అవ‌స‌రం అవు తుంది. స్కూలుకు వెళ్లే వ‌య‌స్సు వ‌చ్చేట‌ప్పటికీ రోజుకు ఐదువేల అంత‌ర్జాతీయ యూనిట్ల విట‌మిన్ - ఎ అవ‌స‌రం అవుతుంది. బ‌డికిపోయే వ‌య‌స్సు వ‌చ్చేట‌ప్ప‌టికీ రోజుకు ఐదువేల అంత‌ర్జాతీయ యూనిట్ల విట‌మిన్ - ఎ అవ‌స‌రం అవుతుంది. ఆకు కూర‌లు, కాయగూర‌లు, పండ్లు, పాలు తీసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ ఎ లోపం (Vitamin A For Eyes) రాకుండా ఉంటుంది. 

Vitamin A  మందులు ప్ర‌మాదమా?

వ్యాధి నిరోధ‌క టీకాల కార్య‌క్ర‌మంలో భాగంగా పోలియో, బూస్ట‌ర్‌, డిపిటి వంటి టీకాల‌తో పాటు Vitamin A ద్ర‌వాన్ని కూడా ప్ర‌భుత్వం పంపిణీ చేస్తుంది. త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌కు విట‌మిన్  ఎ ద్ర‌వం ఇప్పించ‌డం ద్వారా లోపాన్ని అధిగ‌మించ‌వ‌చ్చు. త‌మ పిల్ల‌ల‌కు లోపం రాకూడ‌ద‌ని కొంద‌రు విట‌మిన్ - ఎ మందులు ఇస్తుంటారు. ఇది ప్ర‌మాద‌క‌రం ఎందుకంటే ఆహారం ద్వారా విట‌మిన్ - ఎ పొందితే ఎలాంటి స‌మ‌స్య ఉండ‌దు. 

మందుల ద్వారా అవ‌స‌రానికి మించి తీసుకుంటే హైప‌ర్ విట‌మిన్ - సి అనే జ‌బ్బు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌. దీని వ‌ల్ల పిల్ల‌ల్లో త‌ల‌నొప్పి, వాంతులు, చ‌ర్మం ఊడిపోవ‌డం, వెంట్రుక‌లు రాలిపోవ‌డం, పెద‌వులు చీల‌డం లాంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. ఒక వేళ విట‌మిన్ - ఎ లోపిస్తే, మందుల ద్వారా పొందాల‌నుకున్న‌ప్పుడు అది డాక్ట‌ర్ల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌ర‌గాలి. 


Post a Comment

0 Comments