Ticker

6/recent/ticker-posts

Dental Implants : డెంటల్ ఇంప్లాంట్స్ మంచిదేనా?

Dental Implants: దంత‌క్ష‌యం, చిగుళ్ల వ్యాధి, దెబ్బ‌లు త‌గ‌ల‌టం. ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో చాలా మందికి ప‌ళ్లు ఊడిపోతుంటాయి. ఇలాంటి వారికి గ‌తంలో బ్రిడ్జెస్‌, క‌ట్టుడుప‌ళ్ళు వంటివి అమ‌రు స్తుండేవారు. కానీ ఇప్పుడు అధునాత‌న డెంట‌ల్ ఇంప్లాంట్స్ Dental Implants, ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతున్నాయి.

image show Dental Implants

ఇవి క‌ట్టుడుప‌ళ్ల‌లా పైపైన అమ‌ర్చేవి కావు. ద‌వ‌డ ఎముక లోప‌ల దంత‌మూలం స్థానంలో టైటా నియం ఇంప్లాంటును అమ‌ర్చుతారు. చుట్టూ ఎముక పెరిగి స్థిర ప‌డిన త‌ర్వాత ఇంప్లాంటుపై కృత్రిమ దంతాన్ని ఏర్పాటు చేస్తారు. ఇది అచ్చం స‌హ‌జ‌మైన దంతం మాదిరిగా క‌నిపించ‌డం మాత్ర‌మే కాదు. బ‌లంగానూ ఉంటుంది.

Dental Implants : డెంటల్ ఇంప్లాంట్స్ వ‌ల్ల ఉప‌యోగాలు ఏమిటి?

డెంట‌ల్ ఇంప్లాంట్స్‌ను ద‌వ‌డ ఎముక‌లో కుదురుకునేలా అమ‌రుస్తారు కాబ‌ట్టి ఇవి దాదాపు శాశ్వ‌తంగా ఉంటాయి. మాట్లాడుతున్న‌ప్పుడు క‌ట్టుడు ప‌ళ్ళు teeth, కొన్నిసార్లు నోట్లోకి జారి పోవ‌చ్చు. దీంతో మాట ముద్ద‌ముద్ద‌గా, త‌త్త‌ర‌పోయే ప్ర‌మాద‌ముంది. కానీ ఇంప్లాంట్స్‌తో అలాంటి భ‌య‌మేమీ ఉండ‌దు. మాట కూడా స్ప‌ష్టంగా వ‌స్తుంది.

క‌ట్టుడుప‌ళ్లును త‌ర‌చూ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ Implants శ‌రీరంలో ఒక భాగంలా మారిపోతాయి కాబ‌ట్టి చాలా సౌక‌ర్య‌వంతంగా ఉంటాయి. ఇవి స‌హ‌జ‌మైన దంతాల్లానే బ‌లంగా ఉంటాయి. అందువ‌ల్ల ఇష్ట‌మైన ప‌దార్థాల‌ను హాయిగా తినొచ్చు. ఎలాంటి నొప్పి ఉండ‌దు. 

ఎలాంటి సంకోచం లేకుండా ఉండొచ్చు. ఇది ఆత్మ‌విశ్వాసం పెర‌గ‌టానికి తోడ్ప‌డుతుంది. ఇంప్లాంట్స్‌ను అమ‌ర్చేందుకు ప‌క్క‌దంతాల ప‌రిమాణాన్ని త‌గ్గించ‌డం, క‌దిలించాల్సిన అవ‌స‌ర‌ ముండ‌దు. దీర్థ‌కాలం దంతాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి తోడ్ప‌తాయి. బ్ర‌ష్ brush, చేసుకు నేప్పుడు ఇంప్లాంట్స్ మ‌ధ్య‌లో కూడా తోముకోవ‌చ్చు. ఫ‌లితంగా నోటి శుభ్ర‌త మెరుగు ప‌డుతుంది. ఇవి చాలా ఏళ్ళ పాటు ఉంటాయి. జాగ్ర‌త్త‌గా కాపాడుకుంటే జీవితాంతం ఉంటాయి కూడా.

Post a Comment

0 Comments