Ticker

6/recent/ticker-posts

Mental Health: మాన‌సిక ఆరోగ్యం అంటే ఏమిటి? దానిని పిచ్చి అని అంటారా?

Mental Health:ఆరోగ్య‌మే మ‌హాభాగ్యం అన్నారు పెద్ద‌లు. ఆరోగ్యం అన‌గానే ప్ర‌తి ఒక్క‌రూ త‌ల‌చుకునేది, శ్ర‌ద్ధ తీసుకునేది శారీర‌క ఆరోగ్యం గురించే. కానీ సంపూర్ణ ఆరోగ్యం అంటే శారీర‌క ఆరోగ్య‌మే కాదు, మాన‌సిక ఆరోగ్యం కూడా. మ‌నిషి ఆరోగ్యంలో కీల‌క‌మైన మాన‌సిక ఆరోగ్యం గురించి అంత‌గా ప‌ట్టించుకోరు.

image show Mental Health

అస‌లు మాన‌సిక ఆరోగ్యం గురించి ఆలోచించ‌డానికి గాని చ‌ర్చించ‌డానికి గాని ఇష్ట‌ప‌డ‌రు. విద్యాసంస్థ‌ల‌లో కూడా శారీర‌క ఆరోగ్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తారే గాని మాన‌సిక ప‌రీక్ష‌లు నిర్వ‌హించి హెచ్చ‌రించే ప‌ద్ధ‌తి లేదు. మాన‌సిక ఆరోగ్యం బాగోలేదు అని చెప్పుకుంటే అటువంటి వారి మీద పిచ్చి అనే ముద్ర‌వేస్తారు అనే భ‌యంతో దాని గురించి బ‌య‌ట‌కు చెప్పుకునేందుకు జంకుతారు.

Mental Health : పిచ్చి మాటున స‌మ‌స్య జ‌టిలం

మాన‌సిక అనారోగ్యాల‌తో బాధ‌ప‌డేవారంద‌న్నీ పిచ్చివారిగా, అటువంటి రోగుల‌కు చికిత్స చేసే వారిని పిచ్చి డాక్ట‌ర్లుగా ప‌రిహ‌సిస్తూ సమ‌స్య‌ల‌ను జ‌టిలం చేస్తున్న‌ది స‌మాజం. ఇటువంటి సామా జిక ఒత్తిడి వ‌ల్ల‌నే మాన‌సిక అనారోగ్యం ప్రారంభ‌ద‌శ‌లో గుర్తించినా చికిత్స‌కు తీసుకువెళ్ల‌ని ప‌రిస్థితి కుటుంబాల‌లో ఉంది.

 కానీ మాన‌సిక అనారోగ్యాల‌ను క‌ప్పి పెట్టి, అదే త‌గ్గుతుంద‌ని కొంద‌రు, బ‌య‌ట‌కు చెప్పుకోవ‌డం అవ‌మానంగా భావించి మ‌రికొంద‌రు రోగాన్ని ముద‌ర‌ పెట్టు కుంటున్నారు. ఇది ప‌లు దేశాల‌లో నెల‌కొన్న ప‌రిస్థితి. 

కార‌ణాలు ఏమైనా మాన‌సిక రోగాల‌ (Mental Health) కు చికిత్స‌ల‌ను వెనువెంట‌నే ప్రారంభించ‌డం లేదు. ఈ విష‌యం గుర్తించి, మాన‌సిక రోగాల‌ను తెలుసుకోండి.మాన‌సిక ఆరోగ్యాన్ని కాపాడుకోండి అనే నినాదంతో ప్ర‌పంచ వ్యాప్తంగా మెంట‌ల్ హెల్త్ డేని అక్టోబ‌రు 10న జ‌రుపుతున్నారు. మాన‌సిక అనారోగ్యం కూడా శారీర‌క అనారోగ్యాల వంటిదే.

ఈ విష‌యం స‌మాజంలోని అంద‌రూ అంగీక‌ రించాలి. శారీర‌క అనారోగ్యం చికిత్స‌కు వైద్యుడి ద‌గ్గ‌రికి వెళ్లిన‌ట్టే మాన‌సిక అనారోగ్య చికిత్స కోసం సైకియాట్రిస్ట్ ద‌గ్గ‌రికి వెళ‌తారు. ఇందులో సిగ్గ‌ప‌డాల్సిన అవ‌స‌రం ఏమాత్రం లేదు.

శారీర‌క అనారోగ్యాల‌న్నీ వంశ‌పారంప‌ర్యం కాన‌ట్టే మాన‌సిక అనారోగ్యం కూడా వంశ‌పారంప‌ర్యం కావాల్సిన ప‌నిలేదు. ఈ విష‌యం తెలియ‌క మాన‌సిక అనారోగ్యంతో బాధ‌ప‌డే రోగి ఉన్న కుటుం బం మీద పిచ్చికుటుంబం అని ముద్ర‌వేస్తున్న‌ది స‌మాజం. నిజానికి మాన‌సిక అనా రోగ్యంలో అతిత‌క్కువ శాతం మాత్ర‌మే  వంశ‌పారంప‌ర్యం. మిగిలిన‌వ‌న్నీ ప‌రిస్థితుల ప్ర‌భావాన ఏర్ప‌డేవే.

పెరుగుతున్న మాన‌సిక రోగుల సంఖ్య‌

గ‌త‌కాలంలో కంటే నేడు మాన‌సిక అనారోగ్యంతో స‌త‌మ‌త‌మ‌వుతున్న వారి సంఖ్య పెరిగింది. ప్ర‌స్తుత విద్య‌, ఉద్యోగ రంగాల‌లో నెల‌కొని వున్న ఒత్తిడి ప‌రిస్థితులు యువ‌త మ‌న‌సును దెబ్బ‌ తీస్తున్నాయి. సాంకేతిక ప్ర‌గ‌తి యువ‌త ప్ర‌వర్త‌న‌ను మార్చివేస్తున్న‌ది.

నేటి యువ‌త‌లో డిప్రెష‌న్ (Depression) పెరిగింది. స‌మ‌ర్థ‌త‌కు మించి పెట్టుకుంటున్న ల‌క్ష్యాలు. ఆ ల‌క్ష్యాలు కూడా త‌మ‌కు తాముగా పెట్టుకున్న‌వి కావు. పెద్ద‌లు నిర్ణ‌యించిన ల‌క్ష్యాలు. పెద్ద‌ల ఆశ‌ల‌ను తాము తీర్చ‌లేమోనన్న భ‌యం పిల్ల‌ల‌ను వెంటాడుతున్న‌ది. పైగా విద్యారంగంలో పెరిగిన పోటీ, మార్కులు, ర్యాంకుల మీద దృష్టితో, టీనేజ్‌లోనే హాస్ట‌ల్స్‌లో ఉండి చ‌ద‌వాల్సి వ‌స్తుంది. 

రెసిడెన్షియ‌ల్ కాలేజీల‌లో విద్యావిధానం, ప్ర‌తి అర మార్కు తేడా మార్చే ర్యాంక్‌ల వ‌ల్ల నిరంత‌రం ఒత్తిడే. దీనిని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మై. డిప్రెష‌న్‌కి గురై స‌రైన స‌మ‌యంలో ఆ డిప్రెష‌న్‌ (depression) ని గుర్తించి మాన‌సికచికిత్సచేసే నిపుణుడు లేక చివ‌రికి టీనేజ్వ‌య‌సులోనే ఆత్మ‌హ‌త్య‌లు చేసు కుంటున్నారు. క‌న్న‌వారికి క‌డుపుకోత మిగులుస్తున్న ఈ విద్యావ్య‌వ‌స్థ ఒత్తిడి ఎంత‌మంది పిచ్చి వాళ్ళ‌ను త‌యారు చేస్తున్న‌దో లెక్క‌లేదు.

వాస్త‌వాన్ని అంగీక‌రించ‌లేని మాన‌సిక బ‌ల‌హీన‌త‌. ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం లేదా ఉన్మాద‌ చేష్ట‌లు చేయ‌డం అనేవి ఒక్క‌సారిగా హ‌ఠాత్తుగా జ‌రిగేది కాదు. ముందు నుండే వారి ప్ర‌వ‌ర్త‌న‌లో మార్పు వ‌స్తుంది. ఆ ద‌శ‌లో వారిని గుర్తించి త‌గిన చికిత్స అందించ‌గ‌లిగితే విలువైన ప్రాణాల‌ను కాపాడ‌గులుతారు.

ఆ బాధ్య‌త‌ను త‌ల్లిదండ్రులు లేదా స్నేహితులు లేదా స‌హాధ్యాయులు స్వీక‌రించాలి. మాన‌సిక అనారోగ్యానికి గురైన వారికి త‌గిన స‌హాయం అందించ‌డం అంటే త‌మ కుటుంబానికి, స‌మాజానికి కూడా సేవ చేయ‌డ‌మే. ఉద్యోగంలో ఒత్తిడి (stress), త‌గినంత విశ్రాంతి, నిద్ర క‌రువైన షిఫ్ట్ ఉద్యోగాలు వెర‌సి మాన‌సిక ప్ర‌శాంత‌త‌కి దూరం చేస్తున్నాయి. 

వీటి ప్ర‌భావం దాంప‌త్య బంధం మీద ప‌డుతున్న‌ది. స‌ర్థ‌కుపోయే మ‌న‌స్త‌త్వం త‌గ్గి. వాద‌న‌లు పెరిగి, ప్ర‌తి చిన్న అంశాన్ని పెద్ద‌ది చేసుకుని విడాకుల వైపు అడుగులు వేస్తున్న ఈ త‌రానికి ఒక ర‌క‌మైన మాన‌సిక అనారోగ్య‌మే.

మాన‌సిక ఆరోగ్యం క‌రువ‌య్యే వాతావ‌ర‌ణం కుటుంబ వ్య‌వ‌స్థ‌లోనే వ‌చ్చింది. చిన్న‌కుటుంబాలు చింత‌లేని కుటుంబాలు ఎంత మాత్రం కాదు. చిన్న‌కుటుంబాల‌లో పిల్ల‌ల మాన‌సిక ఆరోగ్యం గురించి ప‌ట్టించు కోలేనంత కెరీర్ బిజీలో త‌ల్లిదండ్ర‌లుంటున్నారు. 

ఎంతో వేగంగా వ‌స్తున్న సామాజిక వైజ్ఞానిక మార్పుల వ‌ల్ల మెంట‌ల్ హెల్త్ (Mental Health) దెబ్బ‌తింటున్న‌ది ధృవీ క‌రిస్తున్న రోజుల్లో మాన‌సిక వైద్య నిపుణుల కొర‌త మ‌రింత ఆందోళ‌ న‌క‌రం. ప్ర‌తివిద్యాసంస్థ‌లో కౌన్సిల‌ర్ నియామ‌కం జ‌ర‌గాల‌న్న‌ది నిబంధ‌న‌.

విద్యాసంస్థ‌ల్లో జ‌రిగే రాగింగ్ కూడా ఒక ర‌క‌మైన మాన‌సిక అనారోగ్యం నుండి పుట్టిన‌దే. ఆ నేప‌థ్యంలో కౌన్సిల‌ర్ (Councillor) నియామ‌కం త‌ప్ప‌నిస‌రి చేసినా, విద్యావ్య‌వ‌స్థ‌లోని ఒత్తిడికి గుర‌వుతున్న వారిని గుర్తించేందుకు మాన‌సిక నిపుణుల‌ను నియ‌మించాల్సిన అవ‌స‌రం ఉంది. 

మాన‌సిక అనారోగ్యం ఏర్ప‌డే ప‌రిస్థితుల గురించి, ఆ అనారోగ్య ప్రాథ‌మిక ల‌క్ష‌ణాల గురించి, చికిత్స తీసుకోవాల్సిన అవ‌స‌రం గురించి విస్తృత ప్ర‌చారం చేసి సైకాల‌జిస్ట్‌, సైకియాట్రిస్ట్ సేవ‌ల‌ను వినియోగించుకునేందుకు రోగుల‌లో ఉన్న అపోహ‌ల‌ను తొల‌గించే ల‌క్ష్యంతో ఏర్ప‌రిచిన మెంట‌ల్ హెల్త్ దినోత్స‌వం ద్వారా మెంట‌ల్హెల్త్ ఆవ‌శ్య‌క‌త గురించి ప్ర‌చారం విస్తృతంగా చేయాల్సి ఉంది.

Post a Comment

0 Comments