Ticker

6/recent/ticker-posts

Ayurveda for Nail : మీ ఆరోగ్యం ఎలా ఉందో గోళ్లు ముందే చెబుతాయి.

Ayurveda for Nail : మీ చేతి గోళ్లు, కాళ్ల గోళ్ల‌లో మార్పులు మీ ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని సూచి స్తాయి. ఆధునికులు, ఆయుర్వేద ఆచార్యులు కూడా గోళ్లు ప‌రీక్షించ‌డంలో వ్యాధి నిర్ణ‌యానికి ప్రాధా న్య‌త‌ని గుర్తించారు. 

image show Ayurveda for Nail

ఈ గోళ్లు మాన‌వులు, జంతువుల వేళ్ళ చివ‌ర‌ల నావ‌రించి ఉన్న గోడ‌లాంటి నిర్మాణం. ఈ గోళ్ల కెర‌టిన్ అనే ప్రోటీన్ ప‌దార్థంతో చేయ‌బ‌డుతుంది. విశేష‌మేమంటే శ‌రీరంలోని అన్నింటి ఎదుగు ద‌ల ఆగిపోయినా, వెంట్రుక‌ల‌తో బాటు గోళ్లు (Ayurveda for Nail) పెరుగుతూనే ఉంటాయి చివ‌రిదాకా!.

గోరు మొద‌టి భాగం లోప‌ల చ‌ర్మానికి అంటుకొని ఉంటుంది. దీన్ని ఎపోనైచిమ్ (eponychium) అంటారు. ఇరు వైపులా గోరు చ‌ర్మానికి అంటుకొని ఉంటుంది. దీన్ని పెరోనైచిమ్ (peronychium) అంటారు. మ‌ధ్య‌భాగం పెద్ద‌ది వేలు చ‌ర్మానికి అంటుకొని ఉంటుంది. 

దీన్ని హైపోచిమ్ (hyponychium) అంటారు. మొత్తం గోరు శిథిల కెర‌టిన్‌తో త‌యారువుతుంది. దాని క్రింది కనెక్టివ్ టిష్యూతో వేలుకి అనుసంధానం చేయ‌బ‌డి ఉంటుంది. గోళ్లు (Nail) ఒక మాసం కాలంలో మూడు మిల్లీమీట‌ర్లు పెరుగుతుంటాయి. 

చిన్న వ‌య‌స్సులో మూడు నుండి ఆరు నెల‌ల కాలం ప‌డుతుంది. చేతిగోళ్లు పెర‌గ‌టానికి, కాలిగోళ్లు పెర‌గ‌టం కొంత ఆల‌స్య‌మ‌వుతుంది. క‌నీసం ప‌న్నెండు నుంచి ప‌ద్దెనిమిది నెల‌లు ప‌డుతుంది. గోళ్ళ ప్ర‌యోజ‌నం శ‌రీరంలో చివ‌రి భాగంపై కాళ్ల‌, చేతి వ్రేళ్ల చివ‌ర‌ల‌ను కాపాడ‌టం, దెబ్బ‌ల నుంచి, ప‌ట్టుకునే ఒత్తిడి నుంచి వ్రేళ్ళ‌ను ర‌క్షించ‌డం, ఆదికాం నుంచి ఈ గోళ్ళ సంర‌క్ష‌ణ‌, అలంక‌ర‌ణ స్త్రీల‌లో ఒక ముఖ్య దీపిక‌. అమెరికా వంటి దేశాల‌లో ఈ నెయిల్ సెంట‌ర్‌లు మ‌గ‌వారికి, ఆడ‌వారికి ప్ర‌త్యేకంగా నిర్వ‌హించ‌బ‌డుతున్న‌వి. 

ఈ గోళ్ల‌లో వికృతులు అనేక చ‌ర్మ (skin) వ్యాధుల కార‌ణంగా వ‌స్తుంటాయి. సాధార‌ణంగా ఫంగ‌న్ ఇన్‌ఫెక్ష‌న్ ద్వారాను, ఇత‌ర సూక్ష్మ‌జీవుల ద్వారాను వ‌స్తాయి. కంటే మ‌న వేళ్ళ‌లో ఉండే మాంస కండ‌రాల‌కి ఆది అతుక్కుని ఉండ‌దు క‌నుక ! అందుకే ఈ జీవం లేని గోళ్ళు ఉంచుకోకూడ‌దు. ప్ర‌తి ప‌దిహేను రోజుల‌కి జాగ్ర‌త్త‌గా తీసివేయాలి. 

చేతి గోళ్ళు అర్ధ‌చంద్రాకారంగా ఉంటాయి. అందువ‌ల్ల కండ చివ‌ర‌ నుండి జాగ్ర‌త్త‌గా క్రింద చ‌ర్మానికి త‌గ‌ల కుండా ఎడం చివ‌ర‌కి క‌త్తిరించాలి. గోరు సగం తెగింద‌ని లాగితే చివ‌ర కండ తెగి ర‌క్తం వ‌స్తుంది. అది మాన‌టం క‌ష్టం. షుగ‌రు వ్యాధి ఉన్న వాళ్లూ మ‌రీ జాగ్ర‌త్త‌గా తీయాలి.

Ayurveda for Nail : వ్యాధి సంకేతాలు ముందే  తెలుస్తాయా?

ఈ గోళ్ళ‌లో వ‌చ్చే మార్పులు ముఖ్య వ్యాధుల‌ను సూచిస్తాయి. ఉదాహ‌ర‌ణ‌కు మీ వేళ్ళ మొద‌లులో వాపు వ‌చ్చింద‌నుకోండి. దాన్ని క‌బ్బింగ్ అంటారు. అది మీ గుండెజ‌బ్బును సూచిస్తుంది. గోళ్ళ‌లో ఉండే మార్పుల‌ని, అస‌మాన‌త‌ల‌ని, వాటిని సూచించే వ్యాధుల‌ని ఐద‌వ శ‌తాబ్ధంలో హిపోక్ర‌టిస్ అనే మేధావ క‌నుక్కున్నాడు. అంత‌కు చాలాకాలం పూర్వం వేద‌కాలంలో అధ‌ర్వ‌ణ వేద ఉపాం గ‌మైన ఆయుర్వేదం చ‌ర‌క సుశృతులు పేర్కొన్నారు. 

గోళ్ల ప‌రీక్ష వ‌ల్ల సంపూర్ణ ఆరోగ్యం, మాన‌సిక ఒత్తిడి, త‌ల‌లో మార్పులు, వృత్తి వ‌ల్ల వ‌చ్చే శారీర‌క మార్పులు, గుండె జ‌బ్బులు, ఆహార లోపం వ‌ల్ల వ‌చ్చే వ్యాధులు తెలుసుకోవ‌చ్చు. మీ గోళ్లు వంపు పోయి చెమ్చాలా మారింద‌నుకోండి. దాన్ని కొయిహోనేకియా అంటారు. అది మీల ర‌క్త క్షీణ‌త‌ను సూచిస్తుంది. మీ గోళ్ల‌పైన నీలం రేఖ‌లు పై నుంచి క్రింద‌కి వ్యాపించి ఉన్నాయ‌నుకోండి. అది మీలో ఎప్ప‌టి నుంచో ఉన్న వ్యాధిని సూచిస్తుంది. 

ర‌క్త నాళాలు ముకులించుకునే స్థితిని, చ‌ల్ల‌టి వాతావర‌ణానికి లోనైన మీ శ‌రీర స్థితిని సూచిస్తుంది. మీ గోళ్ల‌పై స‌న్న‌ని, ఎర్ర‌ని గీత‌లు క‌నిపించి గోళ్ల క్రింద న‌ల్ల‌న‌వుతోంద‌నుకోండి. దాంతో కొంచెం జ్వ‌రం వస్తుంటే గుండెపై పొర వాపుని సూచిస్తుంది.

మీ గోళ్లు ప‌చ్చ‌ని రంగులోకి మారుతూ, ఆకృతి మారి గోళ్ళు క‌దులుతూ ఉంటే శ్వాసావ‌రోధం, ఆయాసంను సూచిస్తాయి. అలాగే గోళ్ల ముందు భాగంలో నొక్కితే సొట్ట ప‌డింద‌నుకోండి. దాన్ని పిట్టింగ్ అంటారు. ఇది సోరియాసిస్ వ్యాధిని సూచిస్తుంది. అలాగే మూత్ర సంబంధిత వ్యాధుల‌లోను ఇది క‌న‌బ‌డుతుంది. 

త‌రుచుగా ర‌క‌ర‌కాల రంగులు గోళ్ళ‌కి వేసుకుంటుంటే అందులోని ధాతు ప‌దార్థాలు, ర‌సాయ‌నిక ప‌దార్థాలు కాల‌క్ర‌మంగా మీ గోళ్ళ‌ని పాడు చేస్తాయి. పెరిగిన గోళ్ల సందులో చేరిన న‌ల్ల‌ని మ‌ట్టిలాంటి పదార్థం మీరు అన్నం తినేట‌ప్పుడు క‌డుక్కోక‌పోతే అన్నాన్ని చూషించి, వ్యాధుల‌ను క‌లుగ‌జేస్తుంది. 

మంచి ఆలోచ‌న‌ల‌తో జీవితాన్ని ప్రేమిస్తూ అపోహ‌లు, అదుర్ధాలు, అర్థం లేని ఆలోచ‌న‌ల‌తో మీరు మాన‌సికంగా శిక్షించుకుంటే మీ గోళ్ళు చెబుతాయి వ‌ద్ద‌ని, విన‌గ‌లిన హృద‌యం మ‌న‌కుండాలి.

గోళ్ళ సంర‌క్ష‌ణ‌కు పాటించాల్సిన సూచ‌నలు!

ప్ర‌కృతి ప్ర‌సాదించిన అద్భుత గోళ్ళ సంర‌క్ష‌ణ‌ (Ayurveda for Nail) , అలంకార భూమిక గోరింటాకు చ‌క్క‌గా రుబ్బుకొని, గోళ్ళ‌కు టోపీలా పెట్టుకొని, గంటా న‌ల‌భై నిమిషాలు ఉంచుకొని, క‌డుగుకుంటే గోళ్ళ రుగ్మ‌త‌లు త‌గ్గి స‌హ‌జ ప్ర‌కాశంతో ఉంటాయి. వారానికి ఒక‌సారి నువ్వుల నూనె కొంచెం వేడి చేసి, ప‌సుపు క‌లిపి పెరిగిన గోళ్ళు తీసుకున్నాక మూడు వైపులా రాసుకుంటే గోళ్ళు స‌మృద్ధిగా ఉంటాయి. 

గోరుచుట్టూ విప‌రీత‌మైన నొప్పి, వాపుల‌తో చాలా బాధ‌పెడుతుంది. ప‌చ్చి ప‌సుపుదుంప నీటితో మెత్త‌గా నూరి, గోరుచుట్టుపై ప‌ట్టులా వేసి, ఆ ప‌ట్టుపైన ప‌సుపు నీళ్ళు పోస్తూ ఉంటే నొప్పి త‌గ్గి ప‌గులుంది. అలాగే చాలా మందికి పుచ్చిన గోళ్ళు ఉంటాయి. 

వాటిని పిప్పిగోళ్ళంటారు. ఒక ఇన‌ప పాత్ర‌లో ప‌సుపుదుంప ర‌సం పోసి, అందులో క‌ర‌క్కాయ పెచ్చులు వేసి మూడు రోజులు నాన‌నిచ్చి, త‌ర్వాత తీసి నూరి, ఆ ముద్ద‌ని గోళ్ళ‌కు లేప‌నంలా పెట్టుకుంటే పిప్పి హరించి మంచిగోళ్లు వ‌స్తాయి.

అలాగే గుమ్మ‌డిపాదు ద‌గ్గ‌ర‌కెళ్ళి లేత ఆకులు తీసుకొని, వేళ్ళ మీద చుట్టుకొని, పైన గుడ్డ క‌ట్టుకొని రోజుకు నాలుగు గంట‌లు ఉంచుకుంటే పిప్పిగోళ్ళు చ‌క్క‌గా త‌యార‌వుతాయి. వేపాకు, నువ్వుల స‌మ‌భాగాలుగా తీసుకొని, తేనెలో మ‌ర్ధించి, గోరుచుట్టూ ఉన్న కురుపుపై వేస్తుంటే, చీము బ‌య‌ ట‌కు వ‌చ్చి, కురుపు త‌గ్గిపోతుంది. 

మీ గోళ్ళు మ‌ధ్య మ‌ధ్య‌లో  చూసుకుంటూ గుర్తించ త‌గ్గ మార్పులు క‌నిపిస్తే దానికి కార‌ణ‌మైన వ్యాధికి చికిత్స చేసుకొన‌డం అవ‌స‌రం. గోరు అర్ధ‌చంద్రాకారంగా, నిగ‌నిగ‌లాడుతూ ఏ బాధా లేకుం డా ఉంటే అది మీ సంపూర్ణ ఆరోగ్యాన్ని సూచిస్తుంది. మీ గోళ్ళు నిర్మ‌లంగా, నిశ్చ‌లంగా ప్ర‌తిరోజూ శుభ్రం చేసుకుంటుంటే అది ఆరోగ్య‌ప్ర‌దం. 

Post a Comment

0 Comments