Mother Milk : తల్లిపాలు తాగుతున్న పాపాయిని వదిలిపెట్టి ఉద్యోగానికి వెళ్లాల్సి వస్తే డబ్బా పాలు ఎంచుకోవాల్సిందేనా? ఆ సమయంలో ఎటువంటి ఆహారం తినాలి. ఇలా మొదటిసారి తల్లైన వారిలో రకరకాల సందేహాలు సహజమే!.అవగాహనతో ముందు జాగ్రత్తలు పాటిస్తే ఉద్యోగానికి వెళ్తున్నా ఇంట్లో ఉన్న పాపాయికి సురక్షితమైన తల్లిపాలు (Mother Milk) అందించడం సులువే.
26 ఏళ్ళ ప్రీతి వారం క్రితమే పండంటి బిడ్డను ప్రసవించింది. కనీసం ఆర్నెళ్ళ వరకూ తనపాలే పట్టాలని తపన ఉన్నా త్వరలో ఉద్యోగానికి వెళ్ళాల్సిన పరిస్థితి. దానికితోడు పాపాయి బరువు తగ్గడంతో పాలు సరిగ్గా రావడం లేదేమో అన్నసందేహంతో వైద్యుల్ని సంప్రదించింది.
ఆమెనే కాదు చాలా మంది తల్లు ల్ని కలవరపెట్టే అంశమే ఇది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. తొలి రోజుల్లో పాల రూపంలో ఉత్పత్తి అయ్యే కొలొస్ట్రమ్ కొద్దిగానే వచ్చినా బిడ్డకు ఆ పాలు సరిపోతాయి.
క్రమంగా మూడో రోజు నుంచి సమృద్ధిగా రావడం మొదలవుతాయి. నెమ్మదిగా పసిబిడ్డలు రోజులో ఎని మిది నుంచి 12 సార్లు పాలు తాగడం మొదలు పెడతారు. క్రమంగా బరువు పుంజుకుని చురుగ్గా, ఆరోగ్యంగా తయారవుతారు. వైద్యుల్ని సంప్రదించినప్పుడు బిడ్డ ఎదుగుదల, తల పరి మాణం పరిశీలిస్తే పాలు సరిపోతున్నదీ లేనిదీ తెలుస్తుంది.
బిడ్డ ఏడ్వడం, నోట్లో వేళ్ళు పెట్టు కోవడం వంటివి చేస్తే ఆకలిగా గుర్తించి పాలు పట్టాలి. అయితే కొందరు ప్రతి గంటకోసారి తాగితే, మరికొందరు రెండు నుంచి మూడు నాలుగు గంటల విరామం తీసుకుంటారు. ఈ అవగాహనతో పాటు తల్లులు మంచి పోషకాహారానికీ ప్రాధాన్యం ఇవ్వాలి.
Mother Milk : ఆహారంతోనే సమృద్ధిగా!
పాలిచ్చే తల్లులు ద్రవపదార్థాలు ముఖ్యంగా మంచినీళ్ళు ఎక్కువ తాగాలి. నెయ్యి, వెన్న, తీపి పదార్థాలు సాధ్యమైనంత వరకు నియంత్రించాలి. అన్నం, గోధుమలు, పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు మేళవించిన సమతులాహారం తీసుకోవాలి. కొవ్వు లేని, తక్కువ కెలోరీలున్న పదార్థాలను ప్రతి రెండు మూడు గంటలకోసారి తినాలి.
రోజూ మూడు నుంచి నాలుగు గ్లాసుల పాలు తాగితే శరీరానికి తగిన కాల్షియం అందుతుంది. యాపిల్, దానిమ్మ, వెల్లుల్లి, నాలుగు బాదం గింజలు, మెంతి ఆకులు, పాలకూర, జామ వంటి వాటిని తరచూ తీసుకోవాలి. రాత్రిపూట మితంగా తినాలి.
పాలను నిల్వ చేసుకునే తీరిది!
తల్లిపాలను సేకరించి కొంత సమయం వరకు భద్రపరచడం ఉద్యోగినులైన తల్లులకు ఇప్పుడు అందు బాటులో ఉన్న సదుపాయమే. ఇందుకోసం కొన్నిరకాల పంపులు లభిస్తున్నాయి. ఎనిమిది గంటల పనివేళలయితే, అవసరాన్ని బట్టి ప్రతి మూడు గంటలకోసారి పాలు సేకరించవచ్చు.
వాటిని పరి శుభ్రమైన, గట్టి మూత ఉండే సీసాల్లోకి మార్చుకుని వాటిపై తేదీ రాసి ఫ్రీజర్‌లో భద్ర పరచాలి. ఫ్రిజ్, ఫ్రీజర్ తలుపులు విడివిడిగా ఉన్న వాటిల్లో అయితే మూణ్ణెళ్ళదాకా నిల్వ చేసుకోవచ్చు.
ఇలా నిల్వ చేసుకుంటున్నప్పుడు ఫ్రిజ్ స్విచ్ ఆపేయకూడదు. వీటిని వాడాలను కుంటు న్నప్పుడు మాత్రం నేరుగా కాకుండా ఆ సీసాను కాసేపు వేడినీటి పాత్రలో ఉంచడం తప్పనిసరి. అలాగని ఓవెన్లో ఉంచడం సరికాదు. నెలలు నిండకుండా ప్రసవిస్తే పాలు పుష్క లంగా ఉత్పత్తి కాకపోవచ్చు.
ఇలాంటి పిల్లల కోసం మిల్క్ బ్యాంకులు (Milk banks) చక్కని ప్రత్యామ్నాయం. పాలు ఎక్కువగా విడుదలయ్యే తల్లుల నుంచి వాటిని సేకరించి, భద్రపరచి అవసరమైన వారికి అందించే సౌకర్యం ఇది. తగిన చర్యలు తీసుకుంటారు. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు.
ఆకృతి కోల్పోకుండా!
పాలిచ్చే సమయంలో రొమ్ములు (breast) ఆకృతి కోల్పోకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ భాగం లోని కండరాల ఆకృతి కోల్పోకుండా రాత్రిళ్లు నూలు లోదుస్తులు ధరించాలి. చనుమొనల్ని శుభ్రం చేసు కొని మెత్తని తువాలతో అద్దాలి.
సబ్బు (soap) వాడితే చనుమొనలు పొడిబారతాయి. కాబట్టి మాయిశ్చరైజర్ (Moisturizer) రాయాలి. ప్రసవానికి ముందు చనుమొనలు లోపలికి ఉన్నట్లయితే వైద్యుల సలహా తీసుకోవాలి.
ప్రసవమయ్యాక రొమ్ములు వాచినట్లు కనిపిస్తే దీనికి తరచూ పాలు పట్టడమే కాదు. గోరువెచ్చని నీటిలో ముంచిన వస్త్రాన్ని ఆభాగంలో అద్దాలి. ఒకే రొమ్ము (Mother Milk) తో కాకుండా మార్చి మార్చి పాలు పట్టాలి.
ఆ తరువాత కూడా చల్లని వస్త్రాన్ని ఐదారు నిమిషాలు రొమ్ముపై ఉంచితే అసౌకర్యం తగ్గుతుంది. రొమ్ములు ఎర్రగా, సున్నితంగా మారి వాచినట్లు కనిపిస్తుంటే, బిడ్డ నోట్లో ఉండే ఫంగల్ ఇన్‌ఫెక్షన్ (Fungal infection) ఆ భాగాలకు చేరిందని గుర్తించి తల్లీబిడ్డలిద్దరూ తగిన చికిత్స తీసుకోవాలి.

0 Comments