Ticker

6/recent/ticker-posts

Skin Beauty Tips: అంద‌మైన చ‌ర్మం సంర‌క్ష‌ణ‌కు పాటించాల్సిన‌వి ఇవే!

Skin Beauty Tips: వ‌య‌సు ముప్పై అయినా  అర‌వైలా క‌నిపిస్తుంటారు కొంద‌రు. చ‌ర్మం విప‌రీ తంగా పొడిబార‌డం, పాలిపోయి నిర్జీవంగా మార‌డం, వంటివెన్నో ఇబ్బందులు మోము కాంతిని త‌గ్గించ‌డే అందుకు కార‌ణం. ఇలాంటి స‌మ‌స్య‌ల్ని నివారించి ప‌సిడి మెరుపులు పొందా లంటే, ఇంట్లోనే స్వ‌యంగా చేసుకునే కొన్నిర‌కాల చికిత్స‌ల గురించి తెలుసుకోవాలి.

image show Skin Beauty Tips

కాలుష్యం స‌రైన చ‌ర్మ సంర‌క్ష‌ణ లేక‌పోవ‌డం వ‌ల్ల చ‌ర్మం స‌హ‌జ కాంతిని కోల్పోతుంది. క్ర‌మంగా ముడ‌త‌లు మొద‌ల‌వుతాయి. ఫ‌లితంగా చిన్న వ‌య‌సులోనే వార్ద‌క్య‌పు ఛాయ‌లు వేధించ‌డం ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలకు ఎదుర‌య్యే ఇబ్బందే. ఇలాంటి వాట‌న్నింటినీ నివారిం చాలంటే ముందు చ‌ర్మాన్ని శుభ్రం చేసుకుని ఆ త‌రువాత కొన్ని పూత‌లు ప్ర‌య‌త్నించాలి.

Skin Beauty Tips : అంద‌మైన చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు..

శుభ్ర‌ప‌ర్చ‌డం:  పావు క‌ప్పు ప‌చ్చిపాల‌ల్లో చెంచా తేనె, అర‌చెంచా, నిమ్మ‌ర‌సం, పావుచెంచా మైదా క‌లిపితే క్లైన్సింగ్ పాలు సిద్ధ‌మ‌వుతాయి. ఈ చిక్క‌ని  మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకుని ఐదు నుంచి ప‌ది నిమిషాల పాటు సున్న‌తంగా మ‌ర్ద‌న చేసి ఆ త‌రువాత క‌డిగేసుకోవాలి.

న‌లుగు: రెండు చెంచాల బియ్యప్పిండిలో చెంచా మొక్క‌జొన్న పిండి, రెండు చెంచాల పెరుగు క‌లిపి చ‌ర్మానికి రాసుకోవాలి. ఇది కూడా ఐదు నుంచి ప‌ది నిమిషాల‌పాటు మ‌ర్ద‌న చేసుకుని ఆ త‌రువాత నీటితో క‌డిగేసుకోవాలి. ఈ ప్ర‌క్రియ పూర్త‌య్యాక ముఖానికి ఆవిరిప‌ట్టి ఆ త‌రువాత ఈ పూత‌ను ప్ర‌య‌త్నించాలి.

ఎండు ఫ‌లాల పూత :  పావు చెంచా కుంకుమ పువ్వు బాదం, జీడిప‌ప్పు, పిస్తా ప‌ప్పులు, ఎండు ద్రాక్ష‌ల‌ను మెత్త‌గా చేసిన మిశ్ర‌మం చెంచా చొప్పున‌, ఎండు ఖ‌ర్జూరాల మిశ్ర‌మం, తేనె చెంచా చొప్పున తీసుకోవాలి. అన్నింటినీ బాగా క‌లిపి ముఖానికి పూత‌లా వేసుకోవాలి. 

ప‌దిహేను నుంచి ఇరువై నిమిషాల దాకా మ‌ర్ద‌న చేయాలి. పూర్తిగా ఆరిపోయాక శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికోసారి చొప్పున కొన్ని రోజుల పాటు ప్ర‌య‌త్నిస్తే యౌవ‌న‌కాంతి సొంత‌మ‌వుతుంది.

చ‌ర్మం తాజాగా  ఉండాలంటే:  రాత్రిళ్ళు నిద్రించే ముందు బాదం నూనె, స‌ముద్ర‌పు చేప నూనె స‌మ‌పాళ్ళ‌లో తీసుకుని మ‌ర్ద‌న చేయాలి. అలాగే స్నానానికి ముందు మీగ‌డ‌, నిమ్మ‌ర‌సాన్ని స‌మ‌పాళ్ల‌లో క‌లిపి శ‌రీరానికి రాసుకుని మ‌ర్ద‌న చేయాలి. దీనివ‌ల్ల చ‌ర్మం కాంతిమంతంగా మారుతుంది. 

పొడి బారిన చ‌ర్మం మెరిసేలా (Skin Beauty Tips):

వార్ధ‌క్య‌పు ఛాయ‌ల‌కు ఇదే మొద‌టి సంకేతం అందుకే చ‌ర్మం ఏ మాత్రం పొడి బారిన‌ట్టు అనిపిస్తున్నా సంర‌క్ష‌ణ చేప‌ట్టాలి. ఏం చేయాలంటే గుడ్డులోని ప‌చ్చ‌ సొన‌లో చెంచా స్వీట్ ఆల్మండ్ ఆయిల్‌, రెండు చెంచాల బాదం మిశ్ర‌మం క‌లిపి వారానికి రెండు సార్లు చొప్పున పూత‌లా వేసుకోవాలి. బాదం మిశ్ర‌మానికి బ‌దులు పొడి కూడా వేసుకోవ‌చ్చు. స‌మ‌స్య చాలా సులువుగా త‌గ్గిపోతుంది.

అదే జిడ్డు చ‌ర్మంత‌త్వం ఉన్న‌వారైతే చెంచా చొప్ప‌న తుల‌సి పొడి, పుదీనా పొడి, గులాబీల పొడి తీసుకుని అన్నింటినీ క‌మ‌లాఫ‌లం ర‌సంతో క‌లిపి రాత్రిళ్లు నిద్రించే ముందు ముఖానికి రాసుకుని ఇరువై నిమిషాల‌య్యాక క‌డిగేసుకోవాలి. ఇలా త‌రుచూ చేస్తుంటే చ‌ర్మం శుభ్ర‌ప‌డి జిడ్డు స‌మ‌స్య అదుపులో ఉంటుంది.

కాలుష్య ప్ర‌భావం, చ‌ర్మంపై దుమ్మూ ధూళి పేరుకోవ‌డం వ‌ల్ల మొటిమ‌ల స‌మ‌స్య (Acne problem) మొద‌ల‌వుతుంది. ఒక వేళ ఈ స‌మ‌స్య ఎక్కువ‌గా వేధిస్తోంటే, ముల్తానీమ‌ట్టి, గంధ‌క చ్ఛూరాల పొడి, దాల్చిన చెక్క‌, పొడి చెంచా చొప్పున తీసుకుని గులాబీ నీరు, క‌మ‌లాఫ‌లం ర‌సంతో క‌లిపి రాసుకోవాలి. వారంలో క‌నీసం మూడుసార్లైనా ఈ పూత‌ను వేసుకోవ‌చ్చు.

సున్నిత‌మైన చ‌ర్మ‌త‌త్వానికి కీరా :

ఈ త‌ర‌హా చ‌ర్మ‌త‌త్వం చాలా త్వ‌ర‌గా ప్ర‌భావిత‌మ‌వుతుంది. చ‌ర్మ స‌మ‌స్య‌లు వేధించ‌కుండా ఉండాలంటే కీరా మిశ్ర‌మం, బార్లీపొడి, గోధుమ పిండి, తేనె చెంచా చొప్పున తీసుకొని మిశ్ర‌మంలా క‌ల‌ప‌డానికి ప‌చ్చిపాలు చేర్చాలి. ఈ పూత‌ను ముఖానికి రాసుకుని కాసేప‌య్యాక క‌డిగేయ్యాలి. చ‌ర్మం చాలా ఆరోగ్యంగా క‌నిపిస్తుంది.

చ‌ర్మం స‌హజంగా మెరిసేలా : రెండు చెంచాల క్యారెట్ మిశ్ర‌మానికి అర‌చెంచా తేనె (honey) క‌లిపి చ‌ర్మానికి రాసుకుని మ‌ర్ద‌న చేయాలి. పొడిగా ఆరిపోయాక శుభ్రంగా క‌డిగేసుకుంటే చాలు. స‌హ‌జ చ‌ర్మం కాంతులీనుతుంది.

క‌ళ‌గా చ‌ర్మం (Skin Beauty Tips) :  గింజ‌ల్లేని న‌ల్ల‌ద్రాక్ష మిశ్ర‌మం. క‌మ‌లాఫ‌లం ర‌సం స‌మ‌పాళ్ల‌లో తీసుకుని దానికి చెంచా ముల్తానీమ‌ట్టి క‌లిపి చ‌ర్మానికి పూత‌లా వేసి మ‌ర్ధ‌న చేయాలి. యౌవ‌న కాంతి సొంత‌మ‌వుతుంది.

చ‌ర్మాన్ని బిగుతుగా ఉంచే పూత‌ :  

ముడ‌త‌ల స‌మ‌స్య‌ల్లే కుండా చ‌ర్మాన్ని దృఢంగా మార్చాలంటే, గుడ్డులోని తెల్ల‌సొన రెండు చెంచాలు, పావు చెంచా నిమ్మ‌ర‌సం, చెంచా తేనె, ముల్తానీమ‌ట్టి చెంచా చొప్పున తీసుకుని అన్నింటినీ క‌ల‌పాలి. ఈ పూత చ‌ర్మానికి తాత్కాలిక మెరుపును తెస్తుంది.

Post a Comment

0 Comments