Ticker

6/recent/ticker-posts

Ragulu Benefits: కండ‌లు గ‌ట్టిగా ఉండాలంటే రాగులు తినాల్సిందే! | Finger Millet

Ragulu Benefits: రాగులు బ‌ల‌వ‌ర్థ‌క‌మైన ఆహారం. ఇందులో కాల్షియం పిల్ల‌ల ఎదుగుద‌ల‌కు ఎంత‌గానో తోడ్ప‌డు తుంది. అమిత‌పుష్టిని క‌లిగిస్తుంది. జుట్టు వ‌త్తుగానూ, పొడుగ్గా పెరుగుతుంది. మ‌ధుమేహ వ్యాధికి రాగుల‌తో చేసిన ఆహార ప‌దార్థాలు, రాగుల గంజి, పాల‌ల్లో క‌లిపిన రాగుల పానీయం చ‌క్క‌ని ఔష‌ధంగా ప‌నిచేస్తుంది.

image show Ragulu Benefits

Ragulu Benefits: రాగులు (Finger Millet) తిన‌డం వ‌ల్ల క‌లిగే ప్ర‌యోజ‌నాలు!

రాగులు ఇత‌ర ధాన్యాల‌కంటే బ‌ల‌వ‌ర్థ‌క‌మైన‌వి. శారీర‌క క‌ష్టం అధికంగా చేసేవారు రాగుల పిండితో త‌యారు చేసిన ప‌దార్థాల‌ను త‌రుచుగా తింటే వారికి నూత‌న శ‌క్తి ల‌భిస్తుంది.రాగుల‌తో అయోడిన్ పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఎదిగే పిల్ల‌ల‌కు పాల‌ల్లో రాగుల‌ను వేయించి పొడిచేసిన పిండిని క‌లిపి తాగించిన‌ట్ల‌యితే వారి ఎదుగుద‌ల‌, ఆరోగ్యం బాగుండి శ‌క్తి ల‌భిస్తుంది. క‌డుపులో మంట‌ను త‌గ్గించి, చ‌లువ చేస్తుంది. పైత్యాన్ని త‌గ్గిస్తుంది.

Ragulu పానీయం ద‌ప్పిక‌ను అరిక‌డుతుంది. వృద్ధాప్యంలో వున్న వారు రాగుల‌తో త‌యారు చేసిన ఆహార ప‌దార్థాల‌ను భుజించ‌డం వ‌ల్ల శ‌రీరానికి బ‌లం, శ‌క్తి చేకూరుతాయి. ఇంకా మ‌హిళ‌లు ఎముక‌ల ప‌టుత్వానికి రాగుల‌తో త‌యారు చేసిన రాగిమాల్ట్‌ను తాగ‌డం మంచిది.రాగి మాల్ట్ ఎముక‌ల ప‌టుత్వానికి ధాతువుల నిర్మాణానికి దోహ‌ద‌ప‌డ‌తాయి. మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్ప‌డ‌కుండా చేస్తుంది. సుగంధిపాలు క‌లిపిన ragi malt ను తీసుకుంటే ర‌క్త‌పోటు అరిక‌డుతుంది.

రాగుల్లో ఎన్నో విట‌మిన్లు ఉన్నాయి. రాగి పిండిని ఏదో ఒక రూపంలో తింటే చాలా మంచిది. రాగి పిండితో గ‌తంలో Ragi java, సంక‌టి వంటివి మాత్ర‌మే చేసేవారు. ఇప్పుడు రాగి బిస్కెట్లు, ల‌డ్లు, ఇడ్లీలు, దోశెలు, అప్పాలు, కేక్‌, ప‌కోడీలు, బ‌జ్జీలు, ఉండ్రాళ్లు, ఉప్మా వంటి ఎన్నో ర‌కాల ప‌దార్థాలు చేస్తున్నారు.

Post a Comment

0 Comments