Fear: కిటికీ పక్కన ఎవరో తచ్చాడుతున్నట్టుగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా అపరాధభావనతో తల్లడిల్లేవారు కిటికీ పక్కన ఒంటరిగా పడుకున్నప్పుడు పీడకలలతో సతమతమవుతారు. అర్థరాత్రి దిగ్గున లేస్తారు. ఎక్కడో నదిలో కొట్టుకు పోతూ ఊపిరాడని స్థితికి లోనయి ప్రాణం పోతుందే మోనన్నంత భయానికి లోనవుతారు.
వెంటనే మెలుకువ వస్తుంది. కలే అని తెలిసి భయంతో వణికిపోతారు. మృత్యుశీతల స్పర్శ అన్నమాట అసలు అర్థం అనుభవంలోకి వస్తుంది. భయమూ, దుఃఖమూ మిళితమై ఆందోళనకీ లోనవుతారు. కానీ పక్కన మనిషి ఎవరూ ఉండరు. అక్కున చేర్చుకునే వారు ఉండరు. ఏం కాదు, నేనున్నాను అని చెప్పేవారు ఎవరూ ఉండరు. ఈ స్థితి మరింత కుంగదీస్తూ ఉంటుంది. అయిప్పటికీ మీకు మీరే ఓదార్పు కావాలి. మిమ్మల్ని మీరే సాంత్వన పర్చుకోవాలి.
Fear: భయం ఎందుకు ఎప్పుడు వేస్తోంది?
ఇలాంటి కలలు తరుచుగా వస్తుంటే మాత్రం వెంటనే జాగ్రత్త పడాలి. సైకియాట్రిస్టుని కలుసుకొని కౌన్సెలింగ్ తీసుకోవాలి.మీ ఇంట్లో ఎవరో ఆత్మహత్య చేసుకుంటారు.అందుకు మీరు కూడా కారణమేమో అనే అపరాధ భావన తొలిచేస్తుంటుంది.
మరీ ముఖ్యంగా ఒంటరిగా ఉన్నప్పుడు, రాత్రి వేళల్లో ఆ గతం గుర్తు కొచ్చి దిగులేస్తుంది. అది ఈ రకమైన కలలకు దారితీస్తుంది. కనుక మీరు కౌన్సెలింగ్ తీసుకోవడం అవసరం.
మీకు బాగా దగ్గరి మిత్రుడు ఆకస్మికంగా కాలం కానీ కాలంలో చనిపోతే సున్నిత మనస్కులైన మీరు విపరీతమైన బాధకు లోనవుతారు. మరీ ముఖ్యంగా ఆ మిత్రుని ఆఖరి క్షణాల్లో పడిన బాధను చూసినప్పటి సన్నివేశాలు మీ మెదడులో ముద్రించుకు పోతాయి. ఒంటరిగా ఉన్నప్పుడు బాధకీ, భయానికీ లోను చేస్తాయి. ఇది వెంటాడే బాధగా పరిణమిస్తే మీరు సైకాలజిస్టును కలవడం అవసరం.
కొందరు జరిగిపోయిన రోడ్డు ప్రమాదాల సన్నివేశాల్ని పూసగుచ్చినట్టు చెబుతారు. అది కొందర్నీ మరింత భయానికి లోను చేస్తుంది. అలాంటి ప్రమాదం జరిగితే తన పరిస్థితి ఏమిటని భయపడు తుంటారు. ఈ రకమైన ఆలోచనలే మిమ్మల్ని వదలకుండా వెన్నాడితే మాత్రం కౌన్సెలింగ్ తీసుకోవడం ఉత్తమం.
ఎప్పుడూ ఏదో జరిగిపోతుందనే భయాందోళనల (Fear) తో సతమతమవుతున్నారా? అంతా ప్రశాం తంగా ఉన్నప్పుడు కూడా ఏమైనా కాని పని జరుగుతుందేమో, అనుకోని ప్రమాదం వాటిల్లు తుందేమో అనే సిండ్రోమ్‌తో బాధపడుతుంటారు మరికొందరు.
ఇవి అనవరపు ఆలోచన లని తెలిసినా, ఇలాగే ఆలోచిస్తుంటారు. ఈ స్థితి నుండి బయట పడాలంటే సైకోథెరపీ అవసరం. మానసిక వైద్యుల్ని కలిసి మీ ఆలోచల్ని వివరంగా పంచుకోవాలి. లేనట్టయితే మీ భయాం దోళనలు, ఒత్తిడి (anxiety Problems) కారణంగా బతుకు దుర్భరవుతుంది.

0 Comments