Ticker

6/recent/ticker-posts

ayurvedic bath: స్నానం చేయ‌డానికి కూడా కొన్ని ప‌ద్ధ‌తులు ఉన్నాయి, అవి ఏమిటంటే?

ayurvedic bath:శారీర‌క మాన‌సికారోగ్యంతో దీర్ఘ‌కాలం జీవించ‌డానికి మాన‌వునికి ప్ర‌తినిత్యం విధి విహిత‌ముగా స్నాన‌మాచ‌రించ‌డం త‌ప్ప‌నిస‌రి. మ‌న హైంద‌వ సాంప్ర‌దాయంలో ప్ర‌తి దినం స్నానం చేయ‌డం స‌నాత‌న‌ముగా అవ‌లంభిస్తున్న ఆచార‌మే.

image show ayurvedic bath

వేస‌వికాలంలోనూ, దేహ ప‌రిశ్ర‌మ అధికంగా చేయు వృత్తుల‌న‌వ‌లంభించు వారునూ తిరిగి మ‌రొక‌సారి సాయంత్రం స్నానం ఆచ‌రించ‌డం ఆరోగ్య‌రిత్యా త‌ప్ప‌నిస‌రి. స్నాన‌మంటే కేవ‌లం శ‌రీర ఉప‌రిత‌లం త‌డిసేట్లుగా మీద నీళ్లు (ayurvedic bath) గుమ్మ‌రించుకోవ‌డ‌మో, అందుబాటులో ఉన్న నీటి మ‌డుగు లేదా స్విమ్మింగు పూలులో ప‌శువు మాదిరిగా పొర్ల‌డం కాదు అని పెద్ద‌లు చెబుతున్నారు. 

ayurvedic bath: శాస్త్రీయంగా స్నానం ఎందుకు చేయాలి?

చ‌ల్ల‌ని నీటితో స్నానం, ర‌క్త‌పిత్త వ్యాధిని శాంతింప‌జేయును. నిత్యం గోరు వెచ్చ‌ని నీటితో స్నానం చేసిన బ‌ల‌క‌రం వాత‌, క‌ఫ వ్యాధుల‌ను పోగొడుతుంది. ఎక్కువ వేడిగా ఉండే నీటితో శిర‌స్సు స్నానం ఆచరిస్తే నేత్రాలకు చెరుపును చేస్తుంది. శ‌రీరంలో వాత క‌ఫ‌ముల‌ను ప్ర‌కోపింప‌జేసి వ్యాధుల‌ను క‌లుగ జేస్తుంది. 

నిత్య‌స్నానం మంచి ఆక‌లిని క‌లిగిస్తుంది. వృష్య‌క‌ర‌ము, ఆయుష్యును వృద్ధి చేస్తుంది. శ‌రీరంలో ఓజ‌స్సును వృద్ధి చేసి తేజ‌స్సును క‌లిగిస్తుంది. బ‌ల‌క‌రం శ‌రీరంపై చెమట వ‌ల్ల ఏర్ప‌డిన మ‌లి న‌మును పోగొట్టి దుర‌ద‌ను, అల‌స‌ట‌ను, ద‌ప్పిక‌ను నివారిస్తుంది. బాహ్య శ‌రీరాన్ని చ‌ల్ల‌ని నీటితో త‌డిపి స్నానం ఆచ‌రించ‌డం వ‌ల్ల వేడి శ‌రీరాంత‌ర్భాగంలోకి పోయి అంత‌రాగ్నిని దీప్తి చెందించి ఆక‌లిని  క‌లిగించును. 

వేడి నీటితో స్నానం చేయ‌డం, పాలు త్రాగ‌డం, త‌న క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు గ‌ల స్త్రీల‌తో సంగ‌మ‌మం, స్నిగ్ధ‌మైన ల‌ఘు భోజ‌నం చేయ‌డం ప‌థ్య‌క‌ర‌ములై యుండి శ‌రీరారోగ్య ర‌క్ష‌ణ‌కు స‌హ‌క‌రిస్తుంది. 

ఉసిరిక (amla) ఫ‌ల స్నాన మ‌హిమ‌

ఉసిరికాయ శ‌రీరానికి కాంతిని, శుభ్ర‌త‌ను క‌లిగించ‌డ‌మే కాక చ‌ర్మ‌వ్యాధుల‌ను పోగొడుతుంది. ఈ కార‌ణం చేత‌నే ఈ మ‌ధ్య‌కాలంలో ఉసిరితో స‌బ్బులు, షాంపూలు త‌యారు చేస్తున్నారు. మ‌న సాంప్ర‌దాయంతో, కార్తీక మాసంలో ఉసిరికా య‌తో స్నాన‌మాచ‌రించ‌డం ఈ ఆరోగ్య సూత్రాల్లో ఒక భాగ‌మే.  ఉసిరిక చూర్ణంతో స్నానం చేయ‌డం వ‌ల్ల వెంట్రుక‌లు నెరియ‌డం, బ‌ట్ట త‌ల ఏర్ప‌డ‌టం గానీ సంభ‌వించ‌వు. అలాంటి వారు 100 సంవ‌త్స‌రాలు జీవిస్తారు.

స్నానం చేయ‌కుండా ఉండాల్సిన వారు!

జ్వ‌రంతోనూ, విరేచ‌నాల‌తో, నేత్ర వ్యాధులు (కంటి స‌మ‌స్య‌లు)తో బాధ‌ప‌డుత‌న్న‌వారు, క‌ర్ష వ్యాధులు తీవ్ర‌త గ‌ల‌వారు, వాత వ్యాధుల‌తో బాధ‌ప‌డుతున్న వారు, క‌డుపు ఉబ్బ‌రంతో ఆయాస ప‌డుతున్న వారు, పీన‌స వ్యాధి, అజీర్ణ వ్యాధి క‌ల‌వారును స్నానం (snanam) చేయ‌కూడ‌దు. అలాగే అప్పుడే ఆహారం భుజించిన వారు కూడా స్నానం (ayurvedic bath)  చేయ‌కూడ‌దు. 

Post a Comment

0 Comments