tired: చాలా బిజీగా ఉంటూ, లెక్కకు మించి పనులు చేసుకుంటూ కొందరు చాలా చురుకుగా కనిపిస్తారు. ఎక్కువ పని చేయకపోయినా వెంటనే అలిసిపోతుంటారు మరికొందరు. అంతేకాదు, వంశ పారంపర్య హార్మోన్ల అసమతుల్యత, శరీర కండరాల్లో ఉండే కొవ్వు తీవ్రత వంటివి కూడా అలసటకు కారణాలుగా చెప్పవచ్చు. ఇలాంటి కారణాలతో ఇబ్బంది పడే వారు ఆహార నియమాలు పాటించడం ద్వారా అలసట (tired) ను తగ్గించుకోవచ్చు.
tired:
అలసటను తగ్గించుకోవడం ఎలా?
👉జీర్ణక్రియ
సరిగ్గా
లేకపోవడం అలసటకు ప్రథమకారణం. ఆహారం బాగా
జీర్ణమై
ఒంటికి పడితే మంచి
శక్తి
వస్తుంది.
కాబట్టి
జీర్ణక్రియను మెరుగుపర్చుకునేందుకు
కావాల్సినంత నీటిని
తాగడం
ఎంతో ఉత్తమం.
👉ప్రతిరోజూ ఆకుకూరలను ఒక
పూట వాడటం ఎంతో మంచిది.
ఆకుకూరలను తీసుకోవడం
వల్ల
జీర్ణక్రియ
మెరుగుపడుతుంది.
అంతేకాదు, కొత్తిమీర,
అల్లం, జీలకర్రను
వంటల్లో
అధికంగా ఉపయోగించాలి.
👉నిద్రించేందుకు ముందుగా
గ్లాసుడు పాలు,
అరటి
పండును తిని
పండుకుంటే జీర్ణక్రియకు
సంబంధించిన వ్యాధులు
దరిచేరవు.
👉సమయానికి
తినడం
వల్ల
జీర్ణప్రక్రియ సులభమై శరీరానికి కావాల్సిన
శక్తి
లభిస్తుంది.
కొవ్వుతో కూడిన
ఆహార పదార్థాలను
తినడం
మానేస్తే మంచిది.
👉జంక్ఫుడ్ను ఎక్కువగా
తీసుకోవడం
మంచిది కాదు.
ఈ జంక్
ఫుడ్స్ తీసుకోవడం వల్ల
చెడు కొలస్ట్రాల్ శరీరంలో ఎక్కువగా చేరుతుంది. దీనివల్ల బరువు
పెరుగుతారు. అందుకే
జంకు ఫుడ్కు ఎంత దూరంగా
ఉంటే అంత
మంచిది.
👉ఇలా, అలసట (tired) కు దూరంగా ఉండాలంటే ఆహారంలో సమయపాలన, పండ్ల రసాలు, ఆకుకూరలను తగిన మోతాదులో తీసుకోవడం ఉత్తమమైన మార్గం.

0 Comments