yoga mat : దేహం
విషయంలో సరైన శ్రద్ధ వహించాలి. శరీరాన్ని హింసించుకునేవారు రాక్షసులు. సర్వదా
నీ మనస్సును
ఉల్లాసంగా ఉంచుకో. దిగులు కలిగించే ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని తరిమివేయి.
యోగి మితిమీరి
తినరాదు.
అలాగే కఠిన ఉపవాసం
చేయరాదు.
అమితంగా నిద్రించ రాదు. పూర్తిగా
నిద్రను
మానరాదు.
ఇలా అన్ని
విషయాల్లోనూ
మధ్యేమార్గాన్ని
అసురించేవాడే యోగి.
రాజయోగాన్ని రంగరించి మనకు అందించిన
స్వామి వివేకానందుని
మాటలు
అవి. ఇప్పుడు
ఆ మాటలకు దూరమై మ్యాట్ (yoga mat) లకు
దగ్గరవుతున్నాం. ఉచితంగా
దొరికింది కదా అని
వదల కుండా ఎంచక్కా చంకన పెట్టుకొని వెళ్లిపోతాం.
కానీ మ్యాట్
నేల మీద పరిచి
వ్యాయామం చేయడానికి బదులు, దాని
మీద పడుఒకని
యోగనిద్రలోకి
జారిపోతాం. ఇంతకీ ఎప్పుడొచ్చిందీ మాయదారి మ్యాట్?.
ఇది లేకుండా
కొన్ని వేల
సంవత్సరాలుగా మన యోగులు చేస్తున్నది ఏమిటి?
yoga mat : హఠ యోగం - రాజ యోగం అంటే ఏమిటి?
హఠ
యోగం అంటే
ఏమిటి? రాజ యోగం అంటే
ఏమిటి? ఊహు!
మనం
తెలుసుకోవడానికి
మనం
ప్రయత్నించం. దీనికి
పర్యవసానం
భారతీయ
సంస్కృతిని మరిచిపోవడం.
ఈ మధ్య ఒకరు
హఠ
యోగం అంటే
హాట్ యోగం అని నిర్వచించాడు.
విపరీతమైన
వేడి మూలంగా
శరీరం
నుండి చెమట వెలువడుతుంది కదా!
దాన్ని తుడుచు
కోవడానికి
తుండుగుడ్డ (towel) తెచ్చుకోండి అని
తన
శిష్యులకు
సలహా ఇచ్చాడు. ఇంకేముంది?
యోగ టవల్స్ కోసం
శిష్యులంతా మార్కెట్‌పై పడ్డారు.
నిజమైన యోగ సాధన అంటే ఏమిటి?
అసలు
నిజమైన
యోగ సాధన అంటే ఏమిటి?
ప్రకృతితో
పోరాడి చెమటలు కక్కడమా?
లేక ప్రకృతి సహాయంతో ఆరోగ్యం
చెడకుండా
మనస్సు, ఇంద్రియాలను అదుపులోకి తెచ్చుకుని
అతీంద్రియ స్థితికి
చేరడమా? కేవలం
శరీర
ఆరోగ్యమే
యోగసాధనల ప్రయోజనమని మనం
అనుకుంటున్నాం.
మనం ఈ
భ్రాంతి నుండి
బయట పడాలి.
ఎన్నో జన్మల పుణ్యఫలంగా
లభించిన
ఈ మానవదేహం పరిపూర్ణతను సాధించడానికి ఓ
పరికరమని
పూర్తిగా మరిచిపోయాం.
చిత్తవృత్తులను నిరోధించి, చిత్త ప్రశాంతతను సాధించాలి. ఈ మనశ్శరీరాలనే తొడుగు (yoga mat) నేను కాదని తెలుసుకొని ఆత్మసిద్ధికి ప్రయత్నించాలి. అదే యోగ సాధన అసలు ప్రయోజనం. ఎక్కువగా మాట్లాడేవాడు యోగి కాలేడు.

0 Comments