Ticker

6/recent/ticker-posts

Ayurveda for Periods : చ‌క్క‌ని నెల‌స‌రి కోసం ఆయుర్వేదం చిట్కాలు

Ayurveda for Periods : ఒక‌మ్మాయికి నెల‌స‌రి వ‌చ్చే రెండురోజుల ముందు నుంచే విప‌రీత‌మైన క‌డుపు నొప్పి, న‌డుం నొప్పి, మ‌రొక‌మ్మాయికి నెల‌స‌రే ప్ర‌తినెలా రాదు. నెలా ఇరువై రోజుల‌కో, రెండు నెల‌ల‌కో క‌ని పిస్తుంది. దాంతో ఏదో చికాకు! ఇంకొకామెకి నెల‌కి రెండుసార్లు నెల‌స‌రి వ‌స్తుంది. వ‌స్తే ప‌ది రోజుల‌దాకా ఆగ‌దు. 

image show Ayurveda for Periods

దీంతో విప‌రీత‌మైన నీర‌సం, చికాకు, ఇలా ప్ర‌తి స్త్రీలో చ‌క్క‌గా సాగ‌వ‌ల్సిన ఋతుచ‌క్రంలో ఎన్నో అవాంత‌రాలు వీటిని ఆర్త‌న వికృతులు అంటారు. గ‌ర్భాశ‌యంలోనో, లోపలి పొర‌లులోనో, శ‌రీరంలో ఇత‌ర వ్యాధులవ‌ల్లో, హార్మోన్ల హెచ్చు త‌గ్గుల వ‌ల్లో జ‌న‌నేంద్రియాల‌లో ఏర్ప‌డే గ‌డ్డ‌ల వ‌ల్లో ఈ ఋతుస్రాంలో బాధ‌లు, మార్పులు క‌లుగుతూ ఉంటాయి. 

Ayurveda for Periods : హార్మోన్ల ప్ర‌భావం

స్త్రీ శ‌రీర ఆకృతి, ఆమె స్వ‌భావ‌సిద్ధ‌మైన ప్ర‌కృతి, ఆమెలో ఉన్న వాత‌, పిత్త‌, క‌ఫ‌శ‌క్తుల‌లో సంభ‌వించే, హెచ్చుత‌గ్గులు వీటికి కార‌ణం. అంత‌ర్గ‌త స్వాభావిక మార్పుల వ‌ల్ల ప్ర‌తి నెలా 29 రోజుల‌కొక‌సారి యోని నుండి స్ర‌వించే ఈ ముదురు ఎరుపు రంగుతో ఉండే ర‌క్తం చిన్న‌చిన్న ముద్ద‌ల‌లాంటి పొర‌ల‌నే ఋతుస్రావం అంటారు.ఆ స్ర‌వించే మూడు నుండి అయిదు రోజుల కాల‌ప‌రిమితిని ఋతుకాలం మెనుస్ట్రువ‌ల్ పీరియ‌డ్ (Ayurveda for Periods) అంటారు. 

ఆ స‌మ‌యంలో స్త్రీని ఋతుమ‌తి అంటారు. ఆ స‌మ‌యంలో స్త్రీ త‌న ఆరోగ్యం కోసం తీసుకునే చిన్న చిన్న జాగ్ర‌త్త‌ల‌ని ఋతుమ‌తీ ధ‌ర్మాలు అంటారు. వాటిలో కొన్నైనా పాటిస్తే భ‌విష్య‌త్తులో బాధ‌లు లేకుండా ఉంటాయి. 

నెల‌స‌రి రావ‌టంలో హెచ్చుత‌గ్గులు, ఆరంభంలో కాస్త ఎక్కువ‌గానూ, మ‌ధ్యలో ఇబ్బందిక‌రంగానూ, చివ‌రిలో శారీర‌క‌, మాస‌నిక మార్పుల‌తోనూ రావ‌డం చాలా వ‌ర‌కూ హార్మోన్ల ప్ర‌భావం వ‌ల్ల జ‌రుగుతుంది. 24 రోజుల నుండి 32 రోజుల మ‌ధ్య‌లో రావ‌డం అస‌హ‌జం కాదు కానీ, నెల‌కి రెండు సార్లు లేదా రెండు మూడు నెల‌ల‌కి ఒక‌సారి రావ‌డం అస‌హజ‌మే కాదు వ్యాధికూడా. 

హార్మోన్ల  హెచ్చుత‌గ్గులే కాదు, ఆ హార్మోన్లు మెద‌డుకు, మిగ‌తాచోట్ల ఇచ్చే సంకేతాల‌లో మార్పులు కూడా ఈ వ్యాధుల‌కి కార‌ణ‌మ‌వుతాయి. పిట్యూట‌రీ గ్రంథిలోనూ, ఓవ‌రీస్‌లోనూ నిలువ ఉండే, ఈస్ట్రోజ‌న్‌, ప్రాజెస్టిరోన్ అనే హార్మోన్లు నెల‌స‌రి (Ayurveda for Periods) చ‌క్క‌గా రావ‌డానికి దోహ‌ద‌ ప‌డ‌తాయి. 

నెల‌స‌రి వ‌చ్చేముందు ఈ గ్రంథులు ఒక‌దాని కొక‌టి పంపుకునే సంకేతాల‌లో మార్పులు వ‌ల్ల నెల‌స‌రిలో హెచ్చుత‌గ్గుల మార్పులు సంభ‌విస్తాయి.గ‌ర్భం రావ‌డం, ఆహారంలో స‌మ‌గ్ర‌త లోపించ‌డం, పోష‌కాహార లోపాలు, 50 ఏళ్ల వ‌య‌స్సు త‌ర్వాత ఆగిపోయే హార్మోన్ల కార‌ణంగా ఈ మార్పులొస్తాయి.

అలా శాశ్వ‌తంగా ఆగిపోయే నెల‌స‌రి స్థితిని క్షీణార్త‌నం మోనోపాజ్ అంటారు. అలాగే ప‌ద‌హారేళ్లు దాటాక పిల్ల‌ల్లో నెల‌స‌రి వ‌స్తూ, హ‌ఠాత్తుగా మూడు నెల‌లు రాక‌పోతే ఆనార్త‌నం అంటారు. నాలుగు నెల‌ల‌కొక‌సారి ఒక‌టి రెండు బొట్లు క‌నిపించిం మానేస్తే, దాన్ని స్వ‌ల్విర్తావం Oligomenorrhea అంటారు. 

కొంత మంది స్త్రీల‌లో 40 ఏళ్లు రాక‌ముందే ఓవ‌రీల సామ‌ర్థ్యం ఆగిపోయి నెల‌స‌రి ముందుగానే ఆగిపోతుంది. దాన్ని POF అంటారు. అలాగే గ‌ర్భాశ‌యం లోప‌లా, బ‌య‌టా గ‌డ్డ‌లు (Fibroids) ఏర్ప‌డ‌టం, గ‌ర్భాశ‌యం లోప‌లి పొర వాయ‌టం, పాండు, టీబీలాంటి శోష వ్యాధులు కూడా ఈ ఆర్త‌న  వికృతుల‌కు కార‌ణం అవుతాయి.

నెల‌స‌రి వ‌చ్చేట‌ప్పుడు ఉన్న‌పుడు విప‌రీత‌మైన క‌డుపునొప్పి, న‌డుమునొప్పి, త‌లనొప్పి వంటివి వ‌చ్చి బాధాక‌ర‌మైతే దాన్ని క‌ష్టార్త‌వం అంటారు. అధికంగా ఒళ్లు ఉండ‌టం లేదా రోజురోజుకీ బ‌రువు పెర‌గ‌డం, సాంక్ర‌మిక వ్యాధులు, గ‌ర్భాశ‌యంలో మెలిక‌లు పోలిప్స్‌, క్యాన్సరు వంటి తీవ్ర వ్యాధులు కూడా నెల‌స‌రి ఉప‌ద్ర‌వాల‌కి కార‌ణ‌మ‌వుతాయి. 

త‌గిన ఆహారం తీసుకుంటే!

మూత్రం మంట‌గా ఉన్నా, గ‌ర్భం తొంద‌ర‌గా రాకుండా ఉన్నా, త‌రుచూ జ్వ‌రం వ‌స్తున్నా, ఎప్ప‌టికీ త‌గ్గ‌ని న‌డుం నొప్పి ఉన్నా, సంభోగ‌స‌మ‌యంలో బాధ‌గా ఉన్నా, నెల‌స‌రి స‌రిగా రాని వారు మ‌రింత జాగ్ర‌త్త‌ప‌డాలి. నెల‌స‌రి ఇబ్బందులు శాఖాహారులు క‌న్నా మాంసాహారుల‌లో త‌క్కువ‌గా ఉంటాయి. కానీ మాంసాహారులు ఎక్కువ‌గా లావు అవుతుంటే ఇది మ‌రీ పెరుగుతుంది. 

అందుకే మందులు తీసుకోవ‌డం క‌న్నా ఆహారం, న‌డ‌వ‌డిక ఆలోచ‌న‌ల‌తో మార్పు ముందు నుంచే కొంచెం జాగ్ర‌త్త‌ప‌డితే ఈ బాధ‌లూ రావు. పాప ప‌న్నెండో సంవ‌త్స‌రంలో అడుగిడుతుంటే సాయంత్రం చిమ్మిరి వుండ‌లు రెండు తినిపించ‌డం మంచిది. మిన‌ప‌గారి ఆహారంలో ఇవ్వ‌డం మంచిది. అలాగే ఇంగువ కూర‌ల్లోనూ, ప‌చ్చ‌ళ్ల‌లోనూ వేయ‌డం మ‌రిచిపోకండి. 

అలాగే తెల్ల‌టి బ్రెడ్ క‌న్నా ఎర్ర‌ని బ్రెడ్ నెల‌స‌రిని స‌రిగ్గా ఉంచే ఆహారం. ఎక్కువ కారం, శ‌న‌గ‌ పిండి వ‌స్తువులు తిన‌కండి. తాజా కూర‌లు, ప‌ళ్లు ముఖ్యంగా బొప్పాయి, జామ‌, దానిమ్మ ప‌ళ్లు నెల‌స‌రిని స‌రిగ్గా ఉంచే ఆహార ప‌దార్థాలు, ప‌ళ్లు, చిక్కుళ్లు, గోరు చిక్కుళ్లు అన్ని వ‌య‌సుల ఆడ‌వారికి మంచిది. 

మాంసాహారం తినేవాళ్లు చేప‌లు, గ్రుడ్లు తిన‌డం మంచిది. ఆలివ్ ఆయిల్‌, నువ్వుల నూనె వంట‌ల‌కి వాడ‌టం నెల‌స‌రిని స‌రిగ్గా ఉంచే చ‌క్క‌టి నూనెలు. ఇవి గ‌ర్భాశ‌య‌పు న‌రాల‌శ‌క్తిని స్థిర‌ప‌రుస్తాయి.

ప్ర‌తిరోజూ రాత్రి రాగిచెంబుతో నీళ్లు ఎక్కువ‌గా తాగ‌డం మంచిది. క్యారెట్ ర‌సం ప్ర‌తిరోజూ తీసు కుంటే నెల‌స‌రి స‌మ‌స్య‌లు రావు. ముల‌క్కాడ‌, గుమ్మ‌డి వ‌డియాలు, పొట్ల‌కాయ‌కూర‌, ప‌చ్చి బొప్పాయి కూర ప్ర‌తి ఆడ‌పిల్ల తింటుంటే నెల‌స‌రి స‌మస్య‌లు రావు, ఎదుగుతున్న ఆడ‌పిల్ల‌లు నువ్వుల పొడితో మొద‌టి ముద్ద తిన‌డం హిత‌క‌రం.

అల్లం (ginger) ర‌సం తేనెలో క‌లుపుకొని తీసుకుంటే నెల‌స‌రి స‌మ‌స్య‌లు (Periods) త‌గ్గుతాయి. సంవ‌త్స‌ రానికి మూడుసార్లు మ‌ధ్య వ‌య‌సు వారు పంచ‌క‌ర్మ చికిత్స చేయంచుకుంటే అన్ని దోషాలూ పోయి నెల‌స‌రి చ‌క్క‌గా సాగుతుంది. 

Post a Comment

0 Comments