Ticker

6/recent/ticker-posts

Saraswati leaf : స‌ర‌స్వ‌తి ఆకు వ‌ల్ల ఇన్ని ఉప‌యోగాలున్నాయా?

image show Saraswati leaf

Saraswati leaf : స‌ర‌స్వ‌తి అంటే జ్ఞానానికి ప్ర‌తిరూప‌మైన స‌ర‌స్వ‌తిమాత‌కు మారురూపంగా మాన‌వ‌ శ‌రీరంలో నిర్మించ‌బ‌డిన మెద‌డు ఈ స‌ర‌స్వ‌తి ఆకులాగే ఏర్ప‌డి ఉండ‌టం సృష్టిక‌ర్త లీలావినోదానికి నిద‌ర్శ‌నం. 

మెద‌డుకు సంబంధించిన వ్యాధుల‌ను మెద‌డు ఆకారంలా ఉండే ఈ స‌ర‌స్వ‌తి ఆకు ప‌రిష్క‌రి స్తుంద‌ని మ‌న‌కు తెలియ‌య‌డం కోస‌మే సృష్టిక‌ర్త ఈ విధంగా సృష్టిం చాడు. అన్ని అవ‌య‌వాల‌ను న‌డిపించే శిరస్సును ఈ స‌ర‌స్వ‌తి ద్వారా శుద్ధిచేసుకుంటూ మ‌న‌ జ్ఞానాన్ని, జ్ఞాప‌క శ‌క్తిని ప్ర‌తిభ‌ను పెంచుకొంటూ ఆ శ‌క్తితో ఈ ఆయుర్వేద జీవ‌న విజ్ఞానాన్ని అంద‌రికీ పంచి పెడుతూ ముందు సాగిపోదాం. 

Saraswati leaf : స‌రస్వ‌తి - రూప గుణ ప్ర‌భావాలు

ఇది నీటిఒడ్డున చెమ్మ‌గ‌ల ప్ర‌దేశాల‌లో మొలిచే మొక్క‌. 'ద' వంటి ఆకారంతో కాడ‌ల చుట్టూ కంగోర ఉంటుంది. ఇది  తీపి వ‌గ‌రు చేదు రుచులు క‌లిగి వాత‌, పిత్త‌, క‌ఫాల‌ను మూడింటిని జ‌యించ‌ గ‌లుగుతుంది. దీని ఉప‌యోగాలు తెలుసుకుందాం.

పిచ్చి కుదురుట‌కు - 

స‌ర‌స్వ‌తి మొక్క  స‌మూల‌ర‌సం 20 గ్రా, తేనె (honey) 20 గ్రా క‌లిపి ఒక మోతాదుగా రెండుపూట‌లా సేవింప చేస్తూ ఉంటే మాన‌సిక వికారం అణ‌గిపోయి పిచ్చి కుదురుతుంది. 

మూర్ఛ త‌గ్గుట‌కు & జ్ఞానం పెరుగుట‌కు - 

స‌రస్వ‌తీ ఆకు (Saraswati leaf) 10 గ్రా, తీసుకొని పావు లీట‌రు మంచి నీటిలో వేసి స‌గం క‌షాయానికి మ‌రిగించి వ‌డ‌పోసి ఆ క‌షాయానికి స‌మంగా ఆవుపాలు క‌లిపి అందులో త‌గినంత ప‌టిక‌బెల్లం పొడివేసి ఉద‌యం పూట ప‌ర‌గ‌డుపున సేవిస్తూ ఉంటే మెద‌డుకు అపార‌మైన శ‌క్తి క‌లిగి జ్ఞానం పెరిగి మూర్ఛ‌, పిచ్చి, అప‌స్మారం, భ‌యం, ఆందోళ‌న త‌గ్గిపోతాయ్‌.

విద్యార్థులు  విజ్ఞాన‌వంతుల‌గుట‌కు -

స‌ర‌స్వ‌తి ఆకును తెచ్చి నీడ‌లో గాలికి ఆర‌బెట్టి దంచి జ‌ల్లించిన పొడి 50 గ్రా, దోర‌గా వేయించిన మిర‌యాల పొడి 3 గ్రా, క‌లిపి ప‌లుచ‌ని బ‌ట్ట‌లో వ‌స్త్ర ఘాలితం చేసి నిలువ వుంచుకోవాలి. రోజూ విద్యార్థుల‌కు ఉద‌యం ప‌ర‌గ‌డుపున నాలుగు చిటికెల పొడి ఒక క‌ప్పు ఆవుపాల‌ (cow's milk) తో గానీ, లేదా గోరు వెచ్చ‌ని నీటిలో వేసి కొంచెం ప‌టిక బెల్లం క‌లిపి తాగిస్తూ ఉంటే బుద్ధి వృద్ధి అవుతుంది.

నాలుక‌కు రుచి తెలియ‌క‌పోతే -

స‌ర‌స్వ‌తి ఆకు, ఆవాలు, న‌ల్ల‌జీల‌క‌ర్ర‌, పిప్ప‌ళ్లు, మోదుగ మాడ‌లు, చిత్ర‌మూలం, శొంఠి వీటిని స‌మంగా క‌లిపిన పొడి నిలువ చేసుకొని రెండుపూట‌లా మూడు వేళ్ల‌కు వ‌చ్చినంత పొడి కొంచెం నీళ్ల‌తో క‌లిపి నాలుక‌కు రుద్దుతూ ఉంటే రుచి తెలుస్తుంది.

న‌త్తి త‌గ్గి మాట‌లు బాగా వ‌చ్చేందుకు - 

స‌ర‌స్వ‌తి ఆకు పొడి ప‌టిక బెల్లం పొడి స‌మంగా క‌లిపి రెండు పూట‌లా 3 గ్రా పొడి నాలుక‌తో కొద్ది కొద్దిగా చ‌ప్ప‌రిస్తుంటే న‌త్తి త‌గ్గి మాట‌లు స్పుటంగా వ‌స్త‌య్‌. 

విద్యార్థుల  స్వ‌ప్న‌ల్క‌ల‌నానికి -

 స‌ర‌స్వ‌తి ఆకు పొడి 5 గ్రా, గొబ్బి గింజ‌ల పొడి 5 గ్రా దోర‌గా వేయించిన గ‌స‌గ‌సాల పొడి 5 గ్రా దోర‌గా వేయించిన మిరియాల పొడి 2 గ్రా, ఏల‌కుల పొడి 3 గ్రా, క‌లిపి శ‌తావ‌రి దుంప‌ల ర‌సంతో మెత్త‌గా మ‌ర్ధ‌న చేసి కుంకుడు గింజంత మాత్ర‌లు క‌ట్టి గాలిలో నీడ‌కు బాగా ఆర‌బెట్టి నిలువ చేయాలి. రెండు పూట‌లా ఒక మాత్ర వేసుకొని ప‌టిక బెల్లం పొడి క‌లిపిన నీటిని ఒక క‌ప్పు తాగుతూ ఉంటే క్ర‌మంగా స్వ‌ప్న‌స్క‌ల‌నం హ‌రించి మెద‌డుకు, శ‌రీరానికి అపార‌మైన బ‌లం సిద్ధిస్తుంది. 

యోని విశాల‌మ‌గుట‌కు -  కొంద‌రు స్త్రీల‌కు ర‌జ‌స్వ‌లైన త‌రువాత కూడా యోని విక‌సించ‌కుండా దాంప‌త్యంలో ఇబ్బంది క‌లుగుతుంది. అలాంటి స్త్రీలు స‌ర‌స్వ‌తి ఆకును నువ్వుల నూనె (Sesame oil)తో నూరి ఆ మిశ్ర‌మాన్ని యోని లోప‌ల చుట్టూ లేప‌నం చేస్తుంటే క్ర‌మంగా అది విశాల‌మ‌వుతుంది. 

ఆయువు, బ‌ల‌ము పెరుగుట‌కు -  స‌ర‌స్వ‌తీ మొక్క‌లు ఇంట్లో పెంచుకుంటూ రోజూ ఉద‌యం ఆకుల‌ను దంచితీసిన ర‌సం 20 గ్రా, మోతాదుగా ప‌ర‌గ‌డుపున సేవిస్తూ ఒక గంట వ‌ర‌కు మ‌రేమీ తిన‌కుండా ఉంటే క్ర‌మంగా శారీక‌ర బ‌లం మ‌రియు ఆయువు పెరుగుతాయి.

స‌ర్వ‌శ‌క్తుల‌నిచ్చే స‌ర‌స్వ‌తి ర‌సాయ‌నం - 

 శుక్ల ప‌క్ష‌మిలో పుష్య‌మీ న‌క్ష‌త్రం ఆదివారం క‌లిసి వ‌చ్చిన రోజున ఉద‌య‌మే స‌ర‌స్వ‌తీ మొక్క‌ల వ‌ద్ద‌కు వెళ్లి ధూప దీప నైవేద్యాల‌తో ఆ మొక్క‌ను పూజించి స‌ర‌స్వ‌తీ మొక్క‌ల‌ను వేర్ల‌తో స‌హా కావాల్సిన‌న్ని తెచ్చుకొని క‌డిగి నీడ‌లో గాలికి ఆర‌బెట్టి దంచి పొడిచేయాలి. అందుకు ముందే ఒక కొత్త‌కుండ తెచ్చుకొని శుభ్రం చేసి ఎండ‌బెట్టి దానిలో ఒక వారం రోజుల పాటు లోప‌లి వైపున ఆవు నెయ్యి రోజూ పూస్తూ ఉండాలి.

ఆ విధంగా ఆవునేతితో మ‌గ్గిన కుండ‌లో పైన త‌యారైన పొడివేసి పైన మూత‌పెట్టి మ‌ట్టితో, బ‌ట్ట‌తో సంధిబంధ‌నం చేసి మ‌ళ్లీ పుష్య‌మీ న‌క్ష‌త్రం ఆదివారం నాడు వ‌చ్చే వ‌ర‌కు క‌దిలించ‌కుండా ఒక మూల‌న చీక‌టిలో ఆకుండ‌ను వుంచి త‌రువాత బ‌య‌ట‌కి తీసి ఒక గాజు పాత్ర‌లో ప‌దార్థాన్ని నిలువ చేసుకోవాలి. (video link)

రోజూ రెండు పూట‌లా పూట‌కు మూడు గ్రాముల మోతాదుగా ఆవు పాల‌తో సేవిస్తూ ఉండాలి. ఇలా చేస్తే స‌ర్వ వ్యాధులు  ఒక నెల రోజుల‌లో సంహ‌రింప‌బ‌డ‌తాయి. దీన్ని ఒక ఏడాది పాటు విడ‌వ కుండా సేవిస్తూ ఉంటే స్థిర‌మైన యవ్వ‌నం అపార‌మైన ఆయువు సిద్ధిస్తాయ‌ని మ‌హ‌ర్షుల ఉవాచ‌.

కామెర్ల‌కు వారం చికిత్స -

స‌ర‌స్వ‌తి ఆకు, ఉసిరికాయ‌ల పైబెర‌డు పొడి ఇంట్లో త‌యారు చేసిన ప‌సుపు స‌మంగా క‌లిపి పూట‌కు మూడు గ్రాముల మోతాదుగా ఒక చెంచా తేనె ఒక క‌ప్పు ఆవుపాల‌తో క‌లిపి రెండు పూట‌లా సేవిస్తూ చ‌ప్పిడి ప‌థ్యం పాటిస్తూ ఉంటే వారం రోజుల్లో కామెర్లు త‌గ్గిపోతాయ్‌.

అంద‌మైన కొడుకు పుట్టుట‌కు - స‌ర‌స్వ‌తి ఆకు (Saraswati leaf) పొడి దోర‌గా వేయించిన శొంఠిపొడి, సోంపు పొడి ఈ మూడింటిని స‌మంగా తీసుకొని ప‌లుచ‌ని బ‌ట్ట‌లో వ‌స్త్ర ఘాళితం చేసి ఒక గాజు పాత్ర‌లో నిలువ చేసుకోవాలి. 

గ‌ర్భం దాల్చిన రోజు నుండి ఈ పొడిని 5 గ్రా నుండి క్ర‌మంగా 10 గ్రా, పెంచుకొంటూ ఒక చెంచా నాటు ఆవు నెయ్యి ఒక చెంచా మేలు ర‌క‌మైన ప‌టిక బెల్లం (Alum jaggery) పొడి క‌లిపి చ‌ప్ప‌రించి తిని గోరు వెచ్చ‌ని ఆవుపాలు సేవిస్తూ ఉంటే గ‌ర్భం దృఢ‌ప‌డి వేవిళ్ళ బాధ లేకుండా అంద‌మైన ఆరోగ్య‌వంత‌మైన సంతానం క‌లుగుతుంది.

ర‌క్త శుద్ధికి స‌ర‌స్వ‌తి - స‌ర‌స్వ‌తి ఆకు పొడి 120 గ్రా, త‌మ‌లపాకు చెట్టు వేర్ల‌పొడి 10 గ్రా, దోర‌గా వేయించిన వాము పొడి 10 గ్రా, అలాగే వేయించిన పిప్ప‌ళ్ల పొడి 10 గ్రా వీటిని త‌మ‌ల‌పాకు ర‌సంతో మెత్త‌గా దంచి గురిగింజ‌త మాత్ర‌లు క‌ట్టి నీడ‌లో గాలికి ఆర‌బెట్టి నిలువ వుంచుకోవాలి. రోజూ మూడు పూట‌లా పూట‌కు ఒక మాత్ర నీటితో సేవిస్తూ ఉంటే 40 రోజుల్లో ర‌క్త శుద్ధి అవుతుంది.  

Post a Comment

0 Comments