Female Body : ఆడవారిని తరుచూ ఇబ్బంది పెట్టే కొన్ని అనారోగ్య సమస్యలు
Female Body: అందంగా కనిపించడానికి ఇచ్చే ప్రాధాన్యత, శరీరం అందించే సూచనలకు ప్రత్యే కించి మహిళలు అంతగా ప్రాధాన్యత ఇవ్వరని భావించవచ్చు. గోళ్ళు చిట్లుతాయి. చలికి గానీ, శరీరం మార్పుల వల్ల గానీ పెదాలు చిట్లుతాయి.
అలాగే ముఖంపైన చిన్న, చిన్న మొటిమలు వస్తాయి. వీటికి చికిత్స చేయించుకుని తద్వారా అందంకోసం మహిళలు అధిక ప్రాధాన్యతనిస్తారు గానీ, శరీరంలో వచ్చే మార్పులు, సంకేతాలను, అనారోగ్యకారణాలను అంతగా పట్టించుకోరు.
తరచూ తలనొప్పి వస్తూ వుంటే నిద్రలేకపోవడం వల్ల అలా జరిగివుండవచ్చునని భావిస్తారు. అలాగే ఎక్కువ సార్లు నడుంనొప్పి వస్తూవుంటే జిమ్ (Gym) లో అధిక సమయం వ్యాయామం చేయ డమే కారణంగా భావిస్తారు. పెదవులు చిట్లుతూ వుంటే చలివల్లో లేదా మరో కారణమో అను కుంటారు.
ఈ సమస్యలన్నీ చాలా తరచుగా వస్తూవుంటే, శరీరంలో మరేదో తీవ్రమైన సమస్య ఉందని భావించాల్సి వుంటుంది. సాధారణంగా కనిపించే లక్షణాలు (Female Body) అలా ఎందుకు వచ్చి వుండవచ్చునని కారణాలను నిపుణులు విశ్లేషిస్తారు.
Female Body : వాటిలో కొన్ని
విడవని తలనొప్పి (headache)
అప్పుడప్పుడూ తలనొప్పిని ప్రతి ఒక్కరూ అనుభవిస్తూ ఉంటారు. నిద్రలేమి, ఆకలి, మానసిక ఒత్తిడి లాంటి కారణాలు కావచ్చు. ఈ తరహా లాంటి వాటిని సాధారణమైన తలనొప్పిగా భావించవచ్చు. అయితే తరచుగా ఎక్కువసార్లు తలనొప్పి వస్తూవుంటే దానికి ఇక్కడ ఉదహారిం చిన కారణాలు కాకపోవచ్చుంటున్నారు వైద్య నిపుణులు.
ఇలాంటి సమయాల్లో కెఫిన్ తగ్గించాలి లేదా నొప్పి నివారణ మందులు ఆపివేయాలి. లేదా తగిన వైద్యం చేయాలి. తలనొప్పి సుదీర్ఘ కాలం కొనసాగినట్లయితే ట్యూమర్లు పెరగడానికి, గుండెపోటు మెదడువాపు లేదా రక్తస్రావానికి దారితీయవచ్చు.
తీసుకోవాల్సిన చర్యలు
ఇలా తలనొప్పి కొనసాగుతూ ఉంటే ఆందోళన చెందనవసరం లేదు. ఎక్కడ, ఎంత సేపు, దాని తీవ్రత ఏంటి, ఎన్ని సార్లు వస్తోంది, దాని పర్యావసానాలు ఎలా ఉన్నాయి, లాంటి అంశాలను పరిశీలించాలి. వీటిని పరిశీలించి డాక్టర్‌కు చెప్పినట్లయితే, కారణాలు తెలుసుకుని సరైన చికిత్సకు అవకాశం కలుగుతుంది.
పెదవులు (lips) చిట్లడం
సాధారణంగా పెదవులు చిట్లినట్టుగా తయారైతే మనకు మనమే తేలికగా చికిత్స చేసుకోవచ్చు. పెదవులు పగిలినప్పుడు మెడికల్ షాపుల్లో లభించే తైలంలాంటి (Lip balm) వాటిని రాయాలి. అయితే నీరు తక్కువగా తాగడం, పెదవులు పొడిబారిపోవడం లాంటి వాటివల్ల కాకపోయినప్పడే లిప్‌బామ్ వాడాలి.
అలాగే విటమిన్లు బి,సి,డిలు తగ్గినప్పుడు, ఎర్రరక్త కణాలు విస్తరించినప్పుడు, చర్మం ఎలర్జీ, దాని ద్వారా రక్తం కారడం, పెదవులపై పొట్టు లేచిపోవడం లాంటివి జరిగితే తగిన కారణాలు తెలు సుకుని చికిత్స చేయాలి.
తీసుకోవాల్సిన చర్యలు
వాతావరణంలో మార్పులు లేకుండా, మంచినీళ్ళు బాగా తాగుతున్నా, లిప్‌బామ్ రాయడం వల్ల ప్రయోజనం వుండకపోవచ్చు. ఈ దశలో చర్మవ్యాధుల చికిత్స నిపుణులను సంప్రదించాలి.
వీపు నొప్పి (back pain)
ఒకే చోట కూర్చుని ఎక్కువ సేపు పనిచేయడం, శక్తికి మించిన బరువులు ఎత్తడం, సక్రమంగా కూర్చోకపోవడం లాంటివాటివల్ల వీపు నొప్పి రావచ్చు. కొన్ని కేసుల్లో వెన్నుపాము చుట్టూ ఉండే డిస్క్ వాపు లేదా ముందుకు రావడం జరగవచ్చు. లేదా మెదడుకు, వెన్నుకు మధ్యభాగంలో ఇన్ఫెక్షన్ రావడం వల్ల నొప్పి రావచ్చు.
తీసుకోవాల్సిన చర్యలు
కేవలం 2 శాతం మందికి మాత్రమే తీవ్రవ్యాధి మూలం పైన తెలిపిన లక్షణాలకు కారణం కావచ్చు. అందువల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడే సూచనలను, బాగా బరువు తగ్గిపోయినప్పుడు మాత్రమే వైద్యులను సంప్రదించాలి.
మితిమీరిన చెమట
శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా వుంచడానికి చెమట (sweat) పోయడం సర్వసాధారణమే. అయితే కోపం, భయం, నిస్సత్తువ, తీవ్ర ఆందోళనలాంటి భావోద్వేగమైన ఒత్తిడిలోనైనప్పుడు శరీరం వేడెక్కుతుంది. అప్పుడు చెమట పోస్తుంది. అయితే ఇన్ఫెక్షన్ ఉండే అవకాశం ఉంది.
తీసుకోవాల్సిన చర్యలు
మనం తాగే నీటి పరిమాణం, శరీర ఉష్ణోగ్రతను బట్టి చెమట వుంటుంది. అయితే అధికంగా చెమటపట్టడం, శరీరం నుండి వేడి సెగలు రావడం జరిగితే వైద్యుడి సలహా తీసుకోవాల్సిందే. చెమట నిరోధక మందులు, బొటెక్ ఇంజెక్షన్లులాంటివి వాడతారు. వైద్యుల సలహా లేకుండా ఆ మందులు వాడరాదు.
చర్మం (skin) పైన కమిలిన గాయాలు
చర్మంపైన ఊదా, గోధుమవన్నె లేదా ఎరుపు రంగులో గాయాలు లాంటివి ఏర్పడవచ్చు. ఎదురు దెబ్బలు తగిలినప్పుడు, కిందపడినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, శరీరంపైన రక్తకణాలు చిట్లడం, రక్తస్రావం సర్వసాధారణం. ఏ గాయం అవకుండా లేదా చిన్నదెబ్బ తగిలినా పెద్ద గాయం ఏర్పడటం.
కమిలినట్టుగా మచ్చలు ఏర్పడటం జరగవచ్చు. ఇలాంటి స్థితిలో దెబ్బలతో సంబంధం లేని మరే విధమైన రుగ్మతలు ఉన్నాయా అని పరిశీలించాలి. కణజాలం దెబ్బ తిన్నదా, రక్తం గూడుకట్టిందా అని పరిశీలించాలి.
వంశపారంపర్యంగా లేదా మందులు వాడటం, విటమిన్ల లోపం, కాలేయ వ్యాధిలాంటివి వున్నాయా అని పరీక్షించాలి. రక్తంలో ప్లేట్లెట్లు తగ్గినప్పుడు కూడా చర్మంపైన మచ్చలు ఏర్పడతాయి.
తీసుకోవాల్సిన చర్యలు
చిన్న గాయాలకే పెద్ద మచ్చలు ఏర్పడినప్పుడు వైద్య నిపుణులను సంపద్రించాలి. అలాగే పొత్తికడుపులో నొప్పి, ఋతుస్రావం ఎక్కువకావడం, అలసట, బలహీనత, దద్దుర్లు, కీళ్ళ నొప్పులు లాంటి లక్షణాలను గమనించాలి.
కడుపులో తేడా
పని, రద్దీ అయిన జీవన విధానం మూలంగా భోజనం సరిగా లేక తరుచుగా కడుపు (stomach) లో తీవ్రమైన తేడాలు వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా గుండెలో మంట వుండవచ్చు. తరచుగా ఇలా జరుగుతూ వుంటే అది జీర్ణాశయం రుగ్మత కావచ్చు. కేవలం పొట్టలో తేడాలను తీవ్రంగా పరిగణిం చకపోయినా, ఈ లక్షణాలు తీవ్రమైనప్పుడు పొట్టలో అల్సర్లు, పేగుల్లో వాపు ఏర్పడవచ్చు.
తీసుకోవాల్సిన చర్యలు (Female Body)
మందుల అవశేషాలు చిన్న ప్రేవులలోకి చేరిపోయి మనిషి బలహీనంగా తయారవుతాడు. దీనివల్ల ఇతర అవయవాలు కూడా రుగ్మతకు గురికావచ్చు. పొట్టలో వచ్చిన తేడాలు ఒకటి, రెండు రోజులు ఉన్నట్లయితే అది వికారానికి దారితీసి వైద్యుడి సహాయం అవసరమవుతుంది.