Kalabanda benefits :
ప్రకృతి మానవుడుకి ప్రసాదించిన వరం కలబంద అని
చెప్పవచ్చు. ఆయుర్వేద
గ్రంథాలలో కూడా కలబంద గురించి
గొప్పగా వర్ణించబడింది. కలబందను
ఉపయోగించడం వల్ల
మనం అనేక ఆరోగ్యకరమైన
ప్రయోజనాలను పొందవచ్చు.
![]() |
శరీరంలో
రోగ నిరోధక శక్తిని
పెంచడంలో,
రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో,
శరీరానికి
తక్షణ
శక్తిని
ఇవ్వడంలో,
జీర్ణ శక్తిని పెంచడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను
నియంత్రించడంలో
కలబంద ఎంతో ఉపయోగపడుతుంది.
చర్మాన్ని,
జుట్టును ఆరోగ్యంగా
ఉంచడంలోనూ
కలబంద ఉపయోగపడుతుంది.
Kalabanda benefits : Aloe vera కలబంద ప్రయోజనాలు
కలబందను ఉపయోగించి
ఏయే అనారోగ్య
సమస్యలను
నయం
చేసుకోవచ్చో
ఇప్పుడు తెలుసు కుందాం.
కలబంద ఉన్న వారి
ఇంట్లో వైరస్, బాక్టీరియాల వల్ల కలిగే
ఇన్ ఫెక్షన్ లు రాకుండా
ఉంటాయి. కలబంద మొక్క
ఉన్న ఇంట్లోని
వారు వ్యాధుల
బారిన పడే అవకాశాలు
తక్కువగా ఉంటాయని,
పిల్లలు
ఉన్న ఇంట్లో
కచ్చితంగా
కలబంద మొక్క ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
కలబంద
గుజ్జులో విటమిన్ బి
12, విటమిన్
సి, విటమిన్ ఎ,
విటమిన్
ఇ లతోపాటు కాల్షియం,జింక్, సోడియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా ఉంటాయి. రోజూ ఉదయం పూట పరగడుపున
ఒక గ్లాసు
గోరు వెచ్చని నీటిలో 30 ఎమ్ ఎల్ కలబంద గుజ్జును
వేసి కలిపి తాగడం వల్ల
మన
శరీరానికి
జరిగే
మేలు అంతా
ఇంతా కాదు.
ఈ విధంగా
తాగడం
వల్ల
షుగర్
వ్యాధి పూర్తిగా
నియంత్రణలోకి వస్తుంది. నీరసం తగ్గి
శరీరం
బలాన్ని
పుంజుకుంటుంది. రోజంతా
ఉత్సాహంగా పని చేయవచ్చు.
బరువు తగ్గడానికి కలబంద గుజ్జు
ఈ విధంగా కలబంద గుజ్జును
నీటిలో కలుపుకుని తాగడం వల్ల
శరీరంలో
పేరుకు పోయిన
కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. తద్వారా బరువు కూడా తగ్గుతారు. కలబంద గుజ్జును
కలిపిన
నీటిని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన
వ్యర్థ
పదార్థాలు
తొలగిపోతాయి.
జీర్ణ వ్యవస్థ మెరుగుపడి అజీర్తి, మలబద్దకం వంటి సమస్యలు
రాకుండా ఉంటాయి.
శరీరంలో
అధిక వేడితో
బాధపడే వారు కలబంద గుజ్జును నీళ్లలో
కలుపుకుని
తాగడం
వల్ల
వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. ఈ
విధంగా తాగడం వల్ల
శరీరంలో
రోగ నిరోధక శక్తి
పెరుగుతుంది. వ్యాధుల
బారిన పడకుండా ఉంటాం.
కలబంద
గుజ్జును (Kalabanda benefits) ఉపయోగించేటప్పుడు దానిపై
ఉండే పచ్చ సొనను తొలగించి శుభ్రంగా
కడిగిన
తరువాతే
ఉపయోగించాలి.
కలబంద గుజ్జుతో దంతాలను కూడా శుభ్రం
చేసుకోవచ్చు.
ఇలా చేయడం వల్ల
దంతాల సమస్యలు
తొలగిపోతాయి.
కలబంద గుజ్జుకు మోకాళ్ల
నొప్పులను
తగ్గించే
గుణం కూడా
ఉంది. కలబంద గుజ్జులో
ఆవ నూనె
కలిపి
మర్దనా చేయడం
వల్ల మోకాళ్ల నొప్పులు తగ్గుతాయి.
కలబంద గుజ్జును వేడి
చేసి దూదితో
మోకాళ్లపై రాస్తూ
ఉండడం
వల్ల
కూడా నొప్పులు
తగ్గుతాయి.
చుండ్రు (dandruff) సమస్య కు పరిష్కారం
కలబంద
గుజ్జులో పెరుగును
కలిపి
జుట్టు కుదుళ్లకు పట్టించడం వల్ల
చుండ్రు సమస్య, జుట్టు
రాలడం
వంటి సమస్యలు
తగ్గుతాయి.
ఈ విధంగా
కలబందను ఉపయోగించి మనకు వచ్చే అనేక
రకాల సమస్యల
నుండి బయటపడవచు.
కొందరిలో
కలబందను ఉపయోగించడం
వల్ల
ఎలర్జీలు
వచ్చే అవకాశం కూడా
ఉంటుంది.
Kalabanda benefits : కనుక మొదటగా కొద్ది మోతాదులో ఉపయోగించి ఎటువంటి ఎలర్జీలు కలగనప్పుడు మాత్రమే అధిక మొత్తంలో ఉపయోగించాలి. మీకు ఏమైనా సందేహాలు, సమస్యలు ఉంటే మీకు దగ్గర్లో ఉన్న మంచి డాక్టర్ గారిని సంప్రదించి తగిన మంచి నిర్ణయాలు తీసుకోవాలి.

0 Comments